Rakesh Master | రాకేశ్ మాస్టర్ మరణంపై గాంధీ ఆస్పత్రి వైద్యులు ఏం చెప్పారంటే..
Rakesh Master | ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ అకాల మరణం సినీ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురించి చేసింది. వారం కిందటి దాకా యాక్టివ్‌గా ఉండి యూట్యూబ్‌లో వీడియోలు పోస్టు చేసిన రాకేశ్ మాస్టర్.. ఇంతలోనే ప్రాణాలు విడిచారని తెలిసి షాకవుతున్నారు. ఈ ఘోరం ఎలా జరిగి ఉంటుందని ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో రాకేశ్ మాస్టర్ మరణంపై ఆస్పత్రి వైద్యులు స్పందించారు.
Rakesh Master | ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ అకాల మరణం సినీ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురించి చేసింది. వారం కిందటి దాకా యాక్టివ్‌గా ఉండి యూట్యూబ్‌లో వీడియోలు పోస్టు చేసిన రాకేశ్ మాస్టర్.. ఇంతలోనే ప్రాణాలు విడిచారని తెలిసి షాకవుతున్నారు. ఈ ఘోరం ఎలా జరిగి ఉంటుందని ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో రాకేశ్ మాస్టర్ మరణంపై ఆస్పత్రి వైద్యులు స్పందించారు.
రాకేశ్ మాస్టర్ ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు వెల్లడించారు. డయాబెటిస్ పేషెంట్ కావడంతో పాటు సివియర్ మెటాబాలిక్ ఎసిడోసిస్ కావడంతో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ జరిగిందని తెలిపారు. దీంతో పరిస్థితి విషమించి సాయంత్రం 5 గంటలకు రాకేశ్ మాస్టర్ ప్రాణాలు విడిచారని పేర్కొన్నారు. విశాఖలో జరిగిన ఓ ఈవెంట్లో పాల్గొని వారం కిందట హైదరాబాద్ తిరిగొచ్చిన రాకేశ్ మాస్టర్ అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ ఉదయం రక్తపు విరోచనాలు కూడా అయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో అతని కుటుంబసభ్యులు మధ్యాహ్నం గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడే చికిత్స పొందుతూ రాకేశ్ మాస్టర్ ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. బోరబండలో సోమవారం రాకేశ్ మాస్టర్ అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా, రాకేశ్ మాస్టర్ మరణించినప్పటికీ మరో ఇద్దరికి చూపు ప్రసాదించబోతున్నారు. ఆయన రెండు కండ్లను దానం చేసేందుకు మాస్టర్ కుటుంబసభ్యులు అంగీకారం తెలిపారు.
రాకేశ్ మాస్టర్ అసలే పేరు ఎస్.రామారావు. తిరుపతి ఆయన జన్మస్థలం. తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చిన రాకేశ్ మాస్టర్ ముక్కురాజు మాస్టర్ దగ్గర కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 1500 సినిమాలకు డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేశారు. తన కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్‌కు స్టెప్స్ కంపోజ్ చేశారు. ఎంతోమంది డ్యాన్స్ మాస్టర్లను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. సౌత్ ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్లుగా కొనసాగుతున్న శేఖర్‌మాస్టర్, జానీ మాస్టర్ కూడా ఆయన శిష్యులే.
Read More :
Chiranjeevi | క్రేజీ టాక్.. కూతురిని ఒప్పించే ప్రయత్నంలో చిరంజీవి..?
Rakesh master | కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ కన్నుమూత
Mahesh Babu | సంక్రాంతి రేసు నుంచి మహేష్‌బాబు అవుట్.. గుంటూరు కారం మూవీ పోస్ట్ పోన్ కానుందా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

