Rakesh master | కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ కన్నుమూత
Rakesh master | ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ (Rakesh master) కన్నుమూశారు. ఇవాళ ఉదయం ఇంట్లో రక్త విరోచనాలు చేసుకున్న రాకేష్ మాస్టర్‌ను కుటుంసభ్యులు వెంటనే గాంధీ హాస్పిటల్ కు తరలించారు.
Rakesh master | ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ (Rakesh master) కన్నుమూశారు. రాకేశ్ మాస్టర్ వారం రోజుల క్రితం వైజాగ్ ఔట్ డోర్ షూటింగ్ నుండి హైదరాబాద్‌కు తిరిగి రాగా.. అప్పటి నుండి అనారోగ్యంతో స్థానిక హాస్పిటల్ లో చికిత్స చేయించుకుంటున్నట్టు సమాచారం. అయితే ఇవాళ ఉదయం ఇంట్లో రక్త విరోచనాలు చేసుకున్న రాకేశ్ మాస్టర్‌ను కుటుంబసభ్యులు వెంటనే గాంధీ హాస్పిటల్ కు తరలించారు.
డాక్టర్లు చికిత్స కొనసాగిస్తుండగా.. రాకేశ్ మాస్టర్ తుదిశ్వాస విడిచారు. డ్యాన్సర్‌గా తన కెరీర్‌ను మొదలుపెట్టిన రాకేశ్ మాస్టర్.. సుమారు 1500 సినిమాలకు పనిచేశారు. రాకేశ్ మాస్టర్ వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ఏదో ఒక వీడియోతో హాట్ టాపిక్‌గా నిలుస్తుండేవాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
రాకేశ్ మాస్టర్ మృతి పట్ల సినీ పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఫాలోవర్లు, అభిమానులు దేవుడిని ప్రార్థిస్తున్నారు. రాకేశ్ మాస్టర్ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటూ.. సహచర డ్యాన్స్ మాస్టర్ల మీద తనదైన సెటైరికల్, కాంట్రవర్సియల్ కామెంట్స్‌తో ఎప్పడూ వార్తల్లో నిలుస్తుండేవాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delimitation Bill | మారిన మద్దతు లెక్కలు.. డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి ఎన్డీయే ‘మిషన్ 360’
Delimitation Bill | చరిత్రలో మొదటిసారి గరిష్ఠంగా సీట్ల పెంపు
Telangana | ఎట్టకేలకు తెలంగాణకు ఊరట.. విభజన చట్టంలోని ప్రతిపాదనకు మించి పెరుగనున్న నియోజకవర్గాలు
డీలిమిటేషన్ బిల్లుపై ఎన్డీయే మిషన్-360.. లోక్‌సభ సీట్ల పెంపు ఖాయం!
Chandrababu | బాబు పగ.. రేవంత్ దగా.. రేవంత్ సర్కార్ పరోక్ష సహకారంతో రెచ్చిపోతున్న ఏపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

