Chiranjeevi | క్రేజీ టాక్.. కూతురిని ఒప్పించే ప్రయత్నంలో చిరంజీవి..?
Chiranjeevi | తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తో సినిమా చేయాలనుందని ఇప్పటికే మనసులో మాటను బయటపెట్టింది సుస్మిత కొణిదెల (Sushmita Konidela) .
Chiranjeevi | తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తో సినిమా చేయాలనుందని ఇప్పటికే మనసులో మాటను బయటపెట్టింది సుస్మిత కొణిదెల (Sushmita Konidela). అంతేకాదు చిరంజీవి కూడా ఓ సినిమా చేయడానికి సిద్దంగా ఉన్నాడని, ఈ దిశగా అడుగులు కూడా పడుతున్నాయన్న టాక్ కూడా నడుస్తోంది. కాగా చిరు సినిమాకు ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్న కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించబోతున్నాడట. కళ్యాణ్ కృష్ణ ట్రాక్ రికార్డు ఆధారంగా డైరెక్టర్ గా అతడి పేరునే పరిశీలిస్తున్నాడని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఓ టాప్ ప్రొడక్షన్ హౌజ్ సుస్మిత హోం బ్యానర్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చిందట. మొత్తం సినిమా నిర్మాణ వ్యయాన్ని కవర్ చేస్తూనే.. లాభాలలో సగం పంచుకునేలా సుస్మితకు ఆ ప్రొడక్షన్ హౌజ్ ఓ ఆఫర్ కూడా చేసినట్టు వార్త ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. అంతా పర్ ఫెక్ట్ గా సాగుతుందనే నమ్మకంతో చిరంజీవి కూడా ఈ ఆలోచన పట్ల ఆసక్తి చూపాడట.
ఇదిలా ఉంటే సుస్మిత మాత్రం ఈ సినిమా క్రెడిట్ మొత్తాన్ని సోలోగా దక్కించుకోవాలనుకుంటోందని టాక్ నడుస్తోంది. ఈ సినిమా విషయంలో లాభనష్టాల షేరింగ్ లాంటి ఆర్థికపరమైన విషయాల కంటే తన తండ్రితో సినిమా చేయడంపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టిందట సుస్మిత . దీంతో మేకర్స్ నుంచి వచ్చిన ప్రతిపాదన పెండింగ్ లో పడ్డట్టు చర్చ నడుస్తోంది.
ఈ విషయంలో చిరంజీవి తన కూతురిని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నాడని టాలీవుడ్ సర్కిల్లో వార్తలు షికారు చేస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో తండ్రీ కూతుళ్ల సోలో కాంబినేషన్లో సినిమా వస్తుందా..? లేదా..? అనేది చూడాలంటున్నారు సినీ జనాలు. చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళాశంకర్ చిత్రంలో నటిస్తున్నాడు. భోళాశంకర్ ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాల్లో ఉంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్కు భారీ ఊరట
Japan | జపాన్లో సాయంత్రం సమయంలో ఆహార పదార్థాలపై రాయితీ.. ఎందుకో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

