Gal Gadot: వండర్ వు-మామ్.. హీరోయిన్ గాల్ గాడట్పై అభిమానుల ప్రశంసలు

న్యూఢిల్లీ: హాలీవుడ్ హీరోయిన్ గాల్ గాడట్ ( Gal Gadot ).. వండర్ వుమన్ ఫిల్మ్‌లో తన నటనతో అందర్నీ స్టన్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తన మాతృ ప్రేమను ప్రదర్శిస్తూ.. అభిమానుల గుండెల్ని గెలిచేసింది ఆ స్టార్. వండర్ వు-మామ్, సూపర్‌మామ్ అంటూ ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియాతో ఆ హీరోయిన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. షూటింగ్ కోసం ప్రిపేరవుతున్న సమయంలో.. గాల్ గాడట్ ఇటీవల పుట్టిన తన మూడవ కూతురికి బ్రెస్ట్ మిల్క్ ఇచ్చేందుకు చనుబాలను పంప్ చేసింది. ఆ సంఘటనకు సంబంధించిన ఫోటోను ఆమె తన ఇన్‌స్టాలో పోస్టు చేసింది. మేకప్ వేసుకుంటున్న సమయంలో ఓ బాటిల్లో చనుబాలను పంప్ చేసింది. సమయాన్ని వృధా చేయకుండా.. తన కూతురి కోసం ముందే బాటిల్లోకి బ్రెస్ట్ మిల్క్‌ను పంప్ చేయడం అందర్నీ అట్రాక్ట్ చేసింది. తెరవెనుక ఓ తల్లిలా అంటూ తన ఫోటోకు ఆమె చేసిన కామెంట్ అభిమానుల్ని ఆలోచింప చేసింది. ఆ ఫోటోకు లైక్‌లు, ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇజ్రాయిలీ నటులంతా హార్ట్ ఐకాన్లతో గాల్‌ను మెచ్చుకున్నారు. సూపర్‌మామ్, గ్రేట్ మామ్ అంటూ అభిమానులు పొగిడేశారు. ఇక ఓ యూజర్ అయితే.. వండర్ వూ-మామ్ అంటూ కామెంట్ చేశాడు. 2008లో పెళ్లి చేసుకున్న వండర్ వుమన్ హీరోయిన్ గాల్ గాడట్కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం డెత్ ఆన్ ద నైల్, రెడ్ నోటీస్ లాంటి చిత్రాల్లో నటిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

