Home
Cinema
Gaami Movie Will Hit The Screens On The 8th Of This Month On This Occasion Hero Vishwaksen Interacted With The Journalists
నిజమైన అఘోరా అనుకున్నారు
‘ఇప్పటివరకు ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమా రాలేదు. యూనివర్సల్ అప్పీల్ ఉన్న చిత్రమిది. దాదాపు ఐదేళ్ల పాటు శ్రమించి సినిమాను తెరకెక్కించాం’ అన్నారు విశ్వక్సేన్.
‘ఇప్పటివరకు ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమా రాలేదు. యూనివర్సల్ అప్పీల్ ఉన్న చిత్రమిది. దాదాపు ఐదేళ్ల పాటు శ్రమించి సినిమాను తెరకెక్కించాం’ అన్నారు విశ్వక్సేన్. ఆయన కథానాయకుడిగా విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ శబరీష్ నిర్మించిన ‘గామి’ చిత్రం ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా శనివారం హీరో విశ్వక్సేన్ పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..
- ఒక ఏడాదిలో ఈ సినిమాను పూర్తి చేయాలంటే వందకోట్ల బడ్జెట్ అవుతుంది. వారణాసి, కుంభమేళాలో షూట్ చేయగలిగాం కాబట్టి బడ్జెట్ కలిసొచ్చింది. ఓ వినూత్నమైన కాన్సెప్ట్ ఇది. భారీ కాన్వాస్‌లో దర్శకుడు ఈ కథ రాసుకున్నాడు. కథలోని భావోద్వేగాలు కదిలిస్తాయి. సెకండాఫ్ స్క్రీన్‌ప్లే అనూహ్య మలుపులతో ఉంటుంది
- ఈ సినిమాలో నేను అఘోరా పాత్రను పోషించాను. ఈ పాత్రలో పర్ఫెక్షన్ కోసం చాలా కసరత్తులు చేశాను. కుంభమేళాలో కొన్ని లక్షల మంది అఘోరాలు ఉంటారు. షూటింగ్ సందర్భంగా వారిలో కలిసిపోయేవాడిని. నేను నిజమైన అఘోరానే అనుకొని దానాలు చేసేవారు. ప్రతి రోజు ఓ సవాలుగా అనిపించిందీ సినిమా. కశ్మీర్లో మైనస్ 30 డిగ్రీల్లో షూట్ చేశాం. కాళ్లు చేతులు గడ్డకట్టుకుపోయేవి. అప్పటి రోజుల్ని తలచుకుంటే ఇంత రిస్క్ చేశానా అనిపిస్తుంది.
- ఈ సినిమాలో నా పాత్రకు డైలాగ్స్ తక్కువగా ఉంటాయి. పూర్తి పర్ఫార్మెన్స్ బేస్డ్‌గానే నా క్యారెక్టర్ సాగుతుంది. స్క్రీన్‌ప్లే మాత్రం హాలీవుడ్ చిత్రం ‘డన్కిర్క్’ ైస్టెల్లో ఉంటుంది. సాంకేతిక అంశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తాయి. ఇలాంటి గొప్ప కథను ఎలాగైనా తెరపై చూడాలని నా వంతు సపోర్ట్‌గా రెమ్యునరేషన్‌ను తీసుకోలేదు.
- ప్రస్తుతం నేను తెలుగు సినిమాలపైనే దృష్టి పెట్టాను. ‘గామి’ తర్వాత ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రేక్షకుల ముందుకొస్తుంది. దీని తర్వాత ‘మెకానిక్ రాఖీ’ పేరుతో సినిమా చేయబోతున్నా. ‘కల్ట్’ సినిమా షూటింగ్ జరుగుతున్నది. కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ ‘లైలా’ సినిమా చేయబోతున్నా. ఇంకా కొన్ని కథలు చర్చల్లో ఉన్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

