Fauji | ‘ఫౌజీ’ షూటింగ్‌కు వెళ్తున్న వాహనానికి ప్రమాదం .. ఒకరి మృతి, పలువురికి తీవ్ర గాయాలు
Fauji | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘ఫౌజీ’. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ మూవీ షూటింగ్ కి వెళుతున్న వాహనానికి ప్రమాదం జరగడంతో విషాదం చోటు చేసుకుంది. సినిమా షూటింగ్లో భాగంగా ప్రొడక్షన్ యూనిట్ సభ్యులు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురవడంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Fauji | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘ఫౌజీ’. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ మూవీ షూటింగ్ కి వెళుతున్న వాహనానికి ప్రమాదం జరగడంతో విషాదం చోటు చేసుకుంది. సినిమా షూటింగ్లో భాగంగా ప్రొడక్షన్ యూనిట్ సభ్యులు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురవడంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం హైదరాబాద్ సమీపంలోని అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతంలో జరిగినట్లు సమాచారం. యూనిట్ సభ్యులు షూటింగ్ కోసం బయలుదేరగా, ఆ కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది.
ఈ ఘటనలో గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంతో ‘ఫౌజీ’ చిత్ర యూనిట్లో తీవ్ర ఆందోళన నెలకొంది. చిత్రబృందం సభ్యులు గాయపడిన వారి ఆరోగ్యంపై ఆరా తీస్తూ, అవసరమైన సహాయం అందించేందుకు ముందుకొస్తున్నారు. ప్రమాదంలో ఒకరి మృతి చెందడం సినిమా యూనిట్‌ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇక ఈ చిత్రాన్ని ‘సీతారామం’తో గుర్తింపు పొందిన దర్శకుడు హను రాఘవపూడి రూపొందిస్తున్నారు. ప్రేమ, దేశభక్తి, యాక్షన్ మేళవింపుతో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలను సొంతం చేసుకుంది.
ఈ చిత్రంలో ప్రభాస్ సరసన హీరోయిన్గా ఇమాన్ ఈశ్వర్ నటిస్తుండగా, ప్రముఖ నటి జయప్రద, బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్, లెజెండరీ నటుడు మిథున్ చక్రవర్తి కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి-సిరీస్ బ్యానర్‌పై గుల్షన్ కుమార్ సమర్పణలో, భూషణ్ కుమార్ ఆధ్వర్యంలో, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రమాదంతో షూటింగ్ షెడ్యూల్‌పై ప్రభావం పడే అవకాశముంది. ఇక ఈ భారీ చిత్రాన్ని ఈ ఏడాది దసరా సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కానీ తాజా ఘటన నేపథ్యంలో విడుదల తేదీపై మార్పులు ఉంటాయా లేదా అన్నది చూడాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

