తెలంగాణ కళాకారుల కోసం

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష బరిలో మరో నటుడు నిలబడబోతున్నారు. సెప్టెంబర్‌లో జరగనున్న ‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీచేయబోతున్నట్లు సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహారావు ఆదివారం ప్రకటించారు. స్వతంత్య్ర అభ్యర్థిగా తాను పోటీచేయనున్నట్లు ఆయన తెలిపారు. సీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ రాబోయే ‘మా’ ఎన్నికల్లో ప్రెసిడెంట్‌గా నేను పోటీచేస్తున్నా. నా ప్యానల్ తెలంగాణవాదం. తెలంగాణ కళాకారులు, వారి ఇబ్బందులతో పాటు ఏపీకి చెందిన చిన్న, పేద, మధ్య తరగతి కళాకారులకు న్యాయం చేయాలన్నదే నా ఆలోచన. హీరోయిన్ తప్ప సినిమాలో ఇద్దరూ మాత్రమే పరభాషా నటులు ఉండాలని పదేళ్ల క్రితం ఏకగ్రీవంగా ‘మా’ నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం ఆ విధానాన్ని పూర్తిగా తుంగలోకి తొక్కడంతో తెలంగాణతో పాటు తెలుగు కళాకారులకు అన్యాయం జరుగుతోంది. తెలుగు సినీ పరిశ్రమతో పాటు తెలంగాణ పరిశ్రమను బతికించుకోవాలనే నేను ఎన్నికల్లో నిలబడుతున్నా’ అని ఆయన తెలిపారు. ఇప్పటికే ‘మా’ అధ్యక్షపదవి కోసం మంచు విష్ణు, ప్రకాష్‌రాజ్, హేమ పోటీచేస్తున్నట్లు ప్రకటించారు. వీరితో పాటు జీవితా రాజశేఖర్ పేరు కూడా వినిపిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

