Bigg Boss Telugu 5 Elimination | 10వ వారం నామినేషన్స్‌లో ఆ ఐదుగురు..డేంజర్ జోన్లో ఉన్నది వాళ్లే !
ఎప్పటిలాగే ఈ వారం కూడా బిగ్ బాస్ 5 తెలుగు (Bigg Boss Telugu 5)లో నామినేషన్ ప్రక్రియ ఆసక్తికరంగా జరిగింది. మైండ్ గేమ్ కూడా ఆడాల్సిందే అని విశ్వ (Vishwa) ఎలిమినేషన్ తో అందరికీ అర్థమైపోయింది.

ఎప్పటిలాగే ఈ వారం కూడా బిగ్ బాస్ 5 తెలుగు (Bigg Boss Telugu 5)లో నామినేషన్ ప్రక్రియ ఆసక్తికరంగా జరిగింది. గతవారం స్ట్రాంగ్ కంటెస్టెంట్ విశ్వ ఎలిమినేట్ కావడంతో..ఇంట్లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. కేవలం కండ బలం చూపించే గేమ్ మాత్రమే అక్కడ ఉండటం సరిపోదు. మైండ్ గేమ్ కూడా ఆడాల్సిందే అని విశ్వ (Vishwa) ఎలిమినేషన్ తో అందరికీ అర్థమైపోయింది. దాంతో ఈ వారం నామినేషన్స్ మరింత ఆసక్తికరంగా జరిగాయి. ముఖ్యంగా బిగ్ బాస్ ఈ వారం నామినేషన్ ప్రక్రియ డిజైన్ చేసిన తీరు కూడా అత్యంత ఆసక్తికరంగా మారింది. ముందుగా అనీ (Anee master) మాస్టర్ నలుగురు కంటెస్టెంట్స్ ను ఎంపిక చేసుకొని జైలుకు పంపిస్తుంది.
అక్కడి నుంచి వాళ్లు బయటికి వచ్చి సేవ్ అవ్వాలంటే..బయట ఉన్న కంటెస్టెంట్స్ ఆ జైలు తాళం చెవి ముందుగా తీసుకొని వాళ్లు ఎవరినైతే సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ పేరు కెప్టెన్ కు తగిన కారణాలతో చెప్పి.. ఆ కంటెస్టెంట్ పేరు చెప్పి బయటికి తీసుకురావాలి. అలా చివరి వరకు జరుగుతుంది చివరగా జైల్లో ఎంత మంది కంటెస్టెంట్స్ ఉంటారో వాళ్ళు ఈ వారం నామినేట్ అయినట్లు. మళ్లీ చివర్లో తన స్పెషల్ పవర్ ఉపయోగించి కెప్టెన్ అనీ మాస్టర్ ఒకరిని సేవ్ చేసినట్లు తెలుస్తోంది. అలా అందరూ అయిపోయిన తర్వాత ఈ వారం ఐదుగురు సభ్యులు నామినేట్ అయినట్టు ప్రచారం జరిగింది. అందులో మానస్ (Maanas) , కాజల్ (Kajal), సన్నీ (Sunny), సిరి, యాంకర్ రవి ఉన్నారు. ఈసారి ఐదుగురు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ నామినేషన్స్ లోకి వచ్చారు.
షణ్ముఖ్ జస్వంత్ (shanmukh jaswanth) చివరి నిమిషంలో నామినేషన్ సేవ్ అయినట్లు తెలుస్తోంది. మరోవైపు జెస్సి అనారోగ్యం కారణంగా ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సారి నామినేషన్స్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉండటంతో ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం కాజల్ కు ఎక్కువగా నెగిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఇంట్లో ఆమె కారణంగా గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయని ప్రేక్షకుల అభిప్రాయం. అందుకే ఈ వారం ఆమె డేంజర్ జోన్లో ఉంది. మరి వారం ముగిసే సరికి పరిస్థితులు ఎలా మారిపోతాయో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Bad Luck Sakhi video song | పల్లెటూరి సరదాలతో ‘బ్యాడ్ లక్ సఖి ‘ వీడియో సాంగ్
Malaika Arora | మలైకా వల్ల అర్జున్ కపూర్ హ్యాపీగా ఉంది అప్పుడేనట..!
Laddunda lyrical promo | దరువేస్తూ బంగార్రాజు ‘లడ్డుందా’ సాంగ్ ప్రోమో
Rana: ఒక్క పోస్ట్‌తో ముగ్గురు సెలబ్రిటీలకు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపిన రానా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

