‘బేబీ’ ఫేం ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘గం..గం..గణేశా’. ఉదయ్ శెట్టి దర్శకుడు. కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మాతలు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ని తన సోషల్‌మీడియా అకౌంట్ ద్వారా ఆనంద్ దేవరకొండ విడుదల చేశారు.
యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతున్నట్లు పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ తెలియజేశారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలను త్వరలో తెలియజేస్తామని దర్శక, నిర్మాతలు అన్నారు. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే విడుదల చేస్తామని వారు తెలిపారు.