Fast X: సినీ ప్రియులకు ఓ వెబ్సైట్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. మామూలుగా అయితే సినిమా చూడాలంటే మనం ఖర్చు పెట్టుకొని వెళ్లి చూస్తాం. సినిమా చూసి వారికి సహాయం చేసిన వాళ్లకు దాదాపు 1000 డాలర్లు ఇస్తామని ఓ వెబ్సైట్ ప్రకటిచింది.
హాలీవుడ్లో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ చిత్రాలకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఈ ఫ్రాంఛైజీలో ఇప్పటివరకు 9 సినిమాలు విడుదలయ్యాయి. ఈ సిరీస్లో 10వ సినిమా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ X మే 19న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఫైనాన్స్ బజ్ అనే ఓ ఇంటర్నేషనల్ వెబ్సైట్ ప్రేక్షకులకు మంచి ఆఫర్ ఇచ్చింది.
ఈ మూవీ విషయంలో వారికి సహాయం చేస్తే ఏకంగా 1000డాలర్లు ఇస్తామని ప్రకటించింది. ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.82000 అన్నమాట. అయితే ప్రైజ్మనీ గెలవాలంటే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ X సినిమా మాత్రమే చూస్తే సరిపోదు. ఈ ఫ్రాంఛైజీలో ఇప్పటివరకు రిలీజ్ అయిన అన్ని సినిమాలు చూడాలి. ఈ సినిమాలు చూసిన తర్వాత ఏ కారు డ్యామేజ్ అయిందో వైబ్సైట్ వారికి తెలియజేయాలి. ఇదంతా ఎందుకంటే ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఇన్స్యూరెన్స్ భారం ఎంత పడుతుందనేది అంచనా వేసేందుకు ఈ ఆఫర్ ఇచ్చారు.
వెబ్సైట్ అంచనాకు ఎవరైతే దగ్గరగా చెప్తారో వారికి 1000 డాలర్ల నగదు బహుమతిని అందజేస్తారు. అంతేకాకుండా సినిమా టికెట్స్, స్నాక్స్ కోసం మరో 100 డాలర్లను ఇవ్వనున్నట్లు తెలిపింది. అయితే ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఉంది. ఈ ఆఫర్ ఇండియా ప్రేక్షకులకు మాత్రం కాదు. అమెరికాలో ఉన్నవారికి మాత్రమే ఆఫర్. 18 ఏళ్లు నిండిన వారికి మాత్రమే ఆఫర్ వర్తిస్తుందని, ఈ నెల 19 వరకు రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపింది.