Emily Willis | గుండెపోటు అనంతరం కోమాలోకి వెళ్లిన నటి
Emily Willis : మాదక ద్రవ్యాల వినియోగం నుంచి కోలుకునేందుకు రీహాబిలిటేషన్ క్యాంప్‌లో ఉన్న నటి ఎమిలీ విల్లిస్ (25)కు గుండెపోటు రావడంతో కోమాలోకి వెళ్లారు.
Emily Willis : మాదక ద్రవ్యాల వినియోగం నుంచి కోలుకునేందుకు రీహాబిలిటేషన్ క్యాంప్‌లో ఉన్న నటి ఎమిలీ విల్లిస్ (25)కు గుండెపోటు రావడంతో కోమాలోకి వెళ్లారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్దితి విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతోందని విల్లిస్ కుటుంబసభ్యులు వెల్లడించారు. ఏ క్షణం ఎలాంటి వార్త వినేందుకైనా సిద్ధంగా ఉండాలని అభిమానులను వారు అప్రమత్తం చేశారు.
మందుల ఓవర్‌డోస్ వల్లనే ఆమెకు గుండెపోటు వచ్చిందనే వార్తలను నటి తండ్రి మైఖేల్ విల్లిస్ తోసిపుచ్చారు. ఆమెకు నిర్వహించిన టాక్సికాలజీ పరీక్షలు నెగెటివ్‌గా వచ్చాయని తెలిపారు. గుండె పోటుకు గురయ్యే ముందు ఆమె వారం రోజులుగా రీహాబిలిటేషన్ చికిత్స పొందుతున్నారు.
డ్రగ్స్ వినియోగం నుంచి బయటపడి తిరిగి ఆరోగ్యంగా బయటకు వచ్చేందుకు ఎమిలీ విల్లిస్ ఎంతగానో ప్రయత్నించిందని తండ్రి వివరించారు. కాగా రెండేండ్ల కిందట ఎమిలీ అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చింది. ఎమిలీ రికవరీ కోసం ఎంతోమంది విరాళాలతో ముందుకొచ్చారని వారందరికీ కుటుంబసభ్యుల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామని మైఖేల్ విల్లిస్ పేర్కొన్నారు.
Read More :
Upasana | అయోధ్య రామ మందిరాన్ని సందర్శించిన మెగా కోడలు ఉపాసన
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

