Farhana Movie | అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న ఫర్హానా మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
నాలుగేళ్ల క్రితం వచ్చిన ‘కౌసల్యా కృష్ణ మూర్తి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఐశ్వర్య రాజేష్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ Farhana Movie on Ott | తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్ వంటి సినిమాలతో తెలుగులో మంచి పాపులారిటీ తెచ్చుకుంది.
Farhana Movie on Ott | గ్లామర్ పాత్రలకు అతీతంగా, కేవలం నటనకు ప్రధాన్యమున్న పాత్రలు పోషిస్తూ తమిళనాట విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది ఐశ్వర్య రాజేష్. సినిమాల్లోకి రావాలంటే రంగు ఏమాత్రం అడ్డు కాదని, నటిన వస్తే చాలని నిరూపించింది ఈ తమిళ సోయగం. నాలుగేళ్ల క్రితం వచ్చిన ‘కౌసల్యా కృష్ణ మూర్తి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఐశ్వర్య రాజేష్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్ వంటి సినిమాలతో తెలుగులో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. పైగా తెలుగు మూలాలున్న అమ్మాయి కావడంతో టాలీవుడ్ ప్రేక్షకులు ఈ బ్యూటీని తెగ ఆదరించారు. ఇక ప్రస్తుతం ఈమె సినిమాలన్నీ తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడువుతూ వస్తున్నాయి. కాగా ఇటీవలే ఐశ్వర్య నటించిన ఫర్హానా సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజై అనూహ్య విజయం సాధించింది. నెల్సన్ వెంకటేషన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సెల్వరాఘవన్ కీలకపాత్ర పోషించాడు.
కొడుకు అనారోగ్యం బారిన పడటంతో తప్పకుండా ఏదో ఒక జాబ్ చేయాల్సి వస్తుంది. దాంతో మగవాళ్ల కామ వాంఛ కోరికలు మాటల్లో తీర్చే ఓ కాల్ సెంటర్ లో పనిచేస్తుంది. జాబ్ నచ్చక పోయినా ఆర్థక ఇబ్బందుల కారణంగా మరో గత్యంతరం లేక ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఆ పని చేస్తుంది. అయితే అలా కాల్ లో ఓ కాలర్ కాస్త విచిత్రంగా మాట్లాడుతాడు. ఆ కాలర్ ను ఐశ్వర్య ఇష్టపడుతుంది. ఇక అదే టైమ్ లో తన జాబ్ గురించి ఇంట్లో వాళ్లకు తెలుస్తుంది. ఇక అప్పటి నుంచి ఆమెను సొంత వాళ్లే చీదరించుకుంటారు. మరోవైపు ఆ కాలర్ తనను వేధిస్తుంటాడు, వెంబటిస్తుంటాడు. ఆ తర్వాత ఫర్హానా జీవితం ఎలా మారింది అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది.
రిలీజ్ కు ముందు ఎన్నో వివాదాలను ఎదుర్కున్న ఈ సినిమా రిలీజ్ తర్వాత కూడా ముస్లింల నుంచి పలు విమర్శలు ఎదుర్కుంది. తమను తప్పుగా చూపించారని ఈ సినిమాపై కేసులు కూడా వేశారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు ఓటీటీ డేట్ కన్ఫార్మ్ అయినట్లు తెలుస్తుంది. ఈ సినిమా హక్కులను సోని లివ్ సంస్థ దక్కించుకుంది. కాగా జూన్ 16 నుంచి ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

