కోలీవుడ్ (kollywood) హీరో విజయ్ (Vijay), వంశీపైడిపల్లి (Vamshi Paidipally) కాంబోలో వస్తున్న చిత్రం వారసుడు..ది బాస్ రిటర్న్స్. తమిళంలో వారిసు టైటిల్‌తో తెరకెక్కుతోంది. కన్నడ భామ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. కాగా ఈ సినిమాలోని ఓ వీడియో సాంగ్ లీక్ న్యూస్ ఇపుడు నెట్టింట్ల ట్రెండింగ్ అవుతోంది. డైరెక్టర్ అమీర్ కుమారుడు ఈ వీడియోసాంగ్లోని కొంత భాగాన్ని ఆన్లైన్లో లీక్ చేసినట్టు నెటిజన్లు గుర్తించారు.
ప్రొడక్షన్ టీం నుంచి హెచ్చరికలు రావడంతో అమీర్ కుమారుడు ఆ వీడియోను డిలీట్ చేసి ప్రొఫైల్‌ను లాక్ చేశాడు. అయితే వీడియో సాంగ్ లీక్ తో అభిమానులు అప్సెట్ అవడమే కాకుండా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లీకులు అవకుండా సరైన చర్యలు తీసుకోవాలని టీంకు విజ్ఞప్తి చేస్తున్నారు. వారసుడు చిత్రంలో శరత్‌కుమార్, జయసుధ, ప్రకాశ్ రాజ్, ప్రభు, యోగిబాబు, శ్రీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్. 2023 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (Sri Venkateswara Creations) బ్యానర్లో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.