హైదరాబాద్: ఏడాది గడిచినా అల్లు అర్జున్ నటించిన పుష్ప ఫీవర్ కొనసాగుతూనే ఉన్నది. సినిమాలోని పాటలు దేశవ్యాప్తంగా భాషలకు అతీతంగా అందరిని ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే. అందులో సామి సామి.. పాట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రష్యాను కూడా ఈ పాట ఒక ఊపుఊపేస్తున్నది. సామి సామి.. పాటకు రష్యన్ మహిళలు అదిరిపోయే స్టెప్పులు వేసి ఆకట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డిసెంబర్ 8న రష్యాలో ఈ సినిమా విడుదలకానుంది.
ఇప్పటికే పుష్ప టీం.. ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. గురువారం మాస్కోలో రష్యన్ లాంగ్వేజ్ ప్రీమియర్‌షోను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి కథానాయకుడు అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్, నాయిక రష్మిక మందన్న హాజరయ్యారు. ఈ నెల 3న సెయింట్‌పీటర్స్‌బర్గ్‌లో కూడా ప్రీమియర్ షోకు ఏర్పాటు చేశారు.