ముంబై: టీవీ నటి సంచితా ఉగాలే(Sanchita Ugale) ఆత్మహత్య చేసుకున్నది. కుమ్కుమ్ భాగ్య సీరియల్లో ఆమె కీలక పాత్ర పోషించింది. ఆమె వయసు 22 ఏళ్లు. కుమ్కుమ్ భాగ్య టీవీ షోతో ఆమె పాపులర్ నటిగా మరింది. చావా చిత్రంలో కూడా ఆమె నటించింది. సంచితా ఆత్మహత్యతో ఆమె అభిమానులు షాక్‌లోకి వెళ్లారు. ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని గంటల ముందు ఆమె తన సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు షేర్ చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. ముంబైలోని నలసోపోరా ప్రాంతంలో తన పేరెంట్స్, సోదరితో కలిసి ఉంటోంది. ఆత్మహత్య ఘటన జరిగిన సమయంలో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏ కారణం చేత ఆమె ఆత్మహత్యకు పాల్పడిందో ఇంకా స్పష్టంగా తెలియదు. రూమ్‌లోని సీలింగ్ ఫ్యాన్‌కు నటి సంచితా ఉరి వేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఆమెను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా.. మృతిచెందినట్లు డాక్టర్లు ద్రువీకరించారు. యాక్సిడెంటల్ డెత్ రిపోర్టును రిజిస్టర్ చేశారు.