విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. పరశురామ్ దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ కథానాయిక. ఏప్రిల్ 5న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. మంగళవారం ఈ సినిమా నుంచి ‘కల్యాణి వచ్చా వచ్చా..’ అనే రెండో గీతాన్ని విడుదల చేశారు.
పెళ్లి నేపథ్యంలో వచ్చే ఈ పాటను అనంత శ్రీరామ్ రచించగా.. మంగ్లీ, కార్తీక్ ఆలపించారు. గోపీసుందర్ స్వరాలను అందించారు. ‘కల్యాణి వచ్చా వచ్చా..పంచ కల్యాణి తెచ్చా తెచ్చా..సింగారీ చెయ్యందించా.. ఏనుగంబారీ సిద్ధంగుంచా..’ అంటూ పెళ్లి సందడికి అద్దం పడుతూ సాగిందీ గీతం. పెళ్లి నేపథ్యంలో ఈ పాట సినిమాలో ప్రధానాకర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: కేయూ మోహనన్, సంగీతం: గోపీసుందర్, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, రచన-దర్శకత్వం: పరశురామ్ పెట్ల.