KU Mohanan | విజువల్స్‌లో సహజత్వం కనిపించాలంటున్న కేయూ మోహనన్
భారతీయ సినిమాటోగ్రాఫర్స్‌లో గొప్ప ప్రతిభావంతుడిగా గుర్తింపును తెచ్చుకున్నారు కేయూ మోహనన్. బాలీవుడ్లో డాన్, తలాష్, అంధాధున్ తెలుగులో ‘మహర్షి’ వంటి చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించారాయన. ఆయన ఛాయాగ్రాహకుడిగా బాధ్యతలు నిర్వర్తించిన తాజా చిత్రం ‘ఫ్యామిలీస్టార్'.
KU Mohanan | భారతీయ సినిమాటోగ్రాఫర్స్‌లో గొప్ప ప్రతిభావంతుడిగా గుర్తింపును తెచ్చుకున్నారు కేయూ మోహనన్. బాలీవుడ్లో డాన్, తలాష్, అంధాధున్ తెలుగులో ‘మహర్షి’ వంటి చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించారాయన. ఆయన ఛాయాగ్రాహకుడిగా బాధ్యతలు నిర్వర్తించిన తాజా చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఈ సందర్భంగా కేయూ మోహనన్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ “ఫ్యామిలీస్టార్’ ఓ అందమైన కుటుంబ కథా చిత్రం. ఓ మధ్యతరగతి యువకుడి కథ. అతను ఫ్యామిలీ కోసం ఏం చేశాడన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ఓ కాలనీ సెట్లో ఎక్కువశాతం షూటింగ్ జరిపాం. సహజమైన కథకు తగినట్లు అంతే సహజంగా విజువల్స్ అందించే ప్రయత్నం చేశాను. లైటింగ్ కూడా నేచురల్‌గా ఉంటుంది. ఓ మధ్యతరగతి కుటుంబాన్ని తెరపై చూస్తున్న అనుభూతి కలుగుతుంది’ అన్నారు.
సినిమాటోగ్రఫీ విషయంలో తాను సహజత్వానికి ప్రాధాన్యతనిస్తానని, ఈస్థటిక్ సెన్స్‌తో విజువల్స్‌ను అందించడానికి ఇష్టపడతానని కేయూ మోహనన్ చెప్పారు. ‘కొత్త ఎక్విప్మెంట్ అవసరమైతేనే వాడతాను. వాస్తవంగా నాకు కమర్షియల్ సినిమాలకంటే ప్రయోగాత్మక ఆర్ట్ సినిమాలే ఎక్కువ ఇష్టం. అందులో అత్యంత సహజంగా సన్నివేశాన్ని తెరపై తీసుకురావొచ్చు’ అని ఆయన తెలిపారు. ‘ఫ్యామిలీస్టార్’ కుటుంబమంతా కలిసి చూడాల్సిన చిత్రమని.. దర్శకుడు పరశురామ్ కుటుంబ విలువల్ని తెలియజేస్తూ ఈ సినిమాను తెరకెక్కించాడని కేయూ మోహనన్ పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

