Fahadh Faasil | తెలుగుతోపాటు పాన్ ఇండియా స్థాయిలో సూపర్ ఫ్యాన్ బేస్ ఉన్న యాక్టర్ ఫహద్ ఫాసిల్. ఈ మాలీవుడ్ స్టార్ యాక్టర్ హీరోగా నటిస్తున్న తెలుగు డెబ్యూ ఫిల్మ్ Don’t Trouble the Trouble. బాహుబలి ఫేం ఆర్కా మీడియా వర్క్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో అంచనాలు భారీగా నెలకొన్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఏప్రిల్ కావడంతో భానుడు తన ప్రతాపాన్నిచూపిస్తున్న విషయం తెలిసిందే. ఓ వైపు ఎండలు దంచికొడుతుంటే మరోవైపు ఫహద్ ఫాసిల్ టీం మాత్రం తగ్గేదేలే అంటూ షూటింగ్ కొనసాగిస్తోంది.
చిత్రయూనిట్ మెంబర్స్ నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగుతూ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. కొందరైతే సన్ స్క్రీన్ బాడీకూల్ లోషన్లు రాసుకుని మరి షూటింగ్లో పాల్గొంటున్నారు. ఇక నిర్మాత శోభు యార్లగడ్డ అయితే కారులో షూటింగ్ లొకేషన్‌కు వచ్చినట్టే వచ్చి ఏం ఎండ.. ఈ ఎండలో షూట్ ఏంట్రా బాబు అన్నట్టుగా మళ్లీ కారులోనే కూర్చొని తిరిగి వెళ్లిపోవడం వీడియోలో చూడొచ్చు. మొత్తానికి ఫహద్ఫాసిల్ టీం ఎండలో పనిచేస్తూనే డీహైడ్రేటెడ్‌గా ఉండాలి.. డోన్ట్ ట్రబుల్ ది ట్రబుల్.. అంటూ తామంతా పక్కా ప్రొఫెషనల్ అని చెప్పకనే చెబుతున్నారు.
ఈ మూవీతో శశాంక్ యేలేటి డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఫాంటసీ సినిమాగా ఫన్, థ్రిల్లింగ్, ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ మూవీని ఆర్కా మీడియా వర్క్స్, ఎస్ ఎస్ రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ Showing Business సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ఎస్ఎస్ రాజమౌళి సమర్పిస్తున్న ఈ మూవీకి కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు.
ఎండలో షూట్ కారు దిగకుండా రివర్స్ అంటూ పారిపోయిన నిర్మాత 🤣pic.twitter.com/Rz7erJoq7R
— Rajesh Manne (@rajeshmanne1) April 17, 2026
Medical kits | తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో హోంగార్డులకు మెడికల్ కిట్లు, డ్రై ఫ్రూట్స్ పంపిణీ
F-15 Jet: ఎఫ్-15 ఫైటర్ జెట్‌లో విహరించిన ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్
VD x Shouryuv | ‘హాయ్ నాన్న’ దర్శకుడితో విజయ్ దేవరకొండ.. క్రేజీగా అనౌన్స్మెంట్ పోస్టర్!