Dhoomam | మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) పాన్ ఇండియా ప్రాజెక్ట్ ధూమమ్ (Dhoomam)లో నటిస్తున్న సంగతి తెలిసిందే. యూ టర్న్ ఫేం పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కోలీవుడ్ భామ అపర్ణ బాలమురళి హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ అప్డేట్ అందించారు మేకర్స్. ధూమమ్ థ్రియాట్రికల్ ట్రైలర్ను జూన్ 8న మధ్యాహ్నం 12:59 గంటలకు లాంఛ్ చేయనున్నట్టు ప్రకటించారు.
ఉత్కంఠభరితమైన సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాలో హృదయాన్ని కదిలించే రైడ్ కోసం రెడీగా ఉండండి.. అంటూ టాప్ బ్యానర్ హోంబలే ఫిలిమ్స్ (Hombale Films) ఇప్పటికే ఓ అప్డేట్ ఇచ్చి సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ సినిమాలో అచ్యుత్ కుమార్, జాయ్ మాథ్యూ, దేవ్ మోహన్, అనూ మోహన్, నందు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో గ్రాండ్గా విడుదల కానుంది.
ఫహద్ ఫాసిల్ మరోవైపు తెలుగులో సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్లో పుష్ప సీక్వెల్ ప్రాజెక్ట్ పుష్ప.. ది రూల్లో కూడా నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
ధూమమ్ ట్రైలర్ అప్డేట్
𝐖𝐞 𝐜𝐚𝐧 𝐚𝐬𝐬𝐮𝐫𝐞 𝐲𝐨𝐮 𝐢𝐭’𝐬 𝐠𝐨𝐢𝐧𝐠 𝐭𝐨 𝐛𝐞 𝐋𝐈𝐓 🔥#DhoomamTrailer on June 8th at 12:59 PM.#Dhoomam #FahadhFaasil @pawanfilms #VijayKiragandur @aparnabala2 @hombalefilms @HombaleGroup @Poornac38242912 #PreethaJayaraman @AneesNadodi @roshanmathew2… pic.twitter.com/dCNQXdzxga
— Hombale Films (@hombalefilms) June 6, 2023