Dhoomam | గెట్ రెడీ.. ఫహద్ ఫాసిల్ ధూమమ్ సెన్సార్, రిలీజ్ అప్డేట్
Dhoomam | మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) నటిస్తోన్న తాజా చిత్రం ధూమమ్ (Dhoomam). తాజాగా ఈ పాన్ ఇండియా సినిమా సెన్సార్ అప్డేట్ అందించారు మేకర్స్. సెన్సార్ విషయాన్ని స్పెషల్ పోస్టర్ ద్వారా తెలియజేశారు మేకర్స్.
Dhoomam | పుష్ప.. ది రైజ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil). ఈ స్టార్ యాక్టర్ నటిస్తోన్న తాజా చిత్రం ధూమమ్ (Dhoomam). తాజాగా ఈ పాన్ ఇండియా సినిమా సెన్సార్ అప్డేట్ అందించారు మేకర్స్. ధూమమ్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ యూ/ఏ సర్టిఫికెట్ జారీచేసింది. ఇదే విషయాన్ని స్పెషల్ పోస్టర్ ద్వారా తెలియజేశారు మేకర్స్. ధూమమ్ చిత్రాన్ని జూన్ 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
ఈ చిత్రంలో కోలీవుడ్ బ్యూటీ అపర్ణ బాలమురళి హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన ధూమమ్ ఫస్ట్ లుక్, ట్రైలర్ నెట్టింట హల్ చల్ చేస్తూ.. సినిమాపై క్యూరియాసిటీ, అంచనాలు పెంచేస్తున్నాయి.కేజీఎఫ్ లాంటి హిట్ ప్రాంచైజీని అందించిన అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ (Hombale Films) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ధూమమ్ సినిమాలో అచ్యుత్ కుమార్, వినీత్, జాయ్ మాథ్యూ, దేవ్ మోహన్, అనూ మోహన్, నందు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ట్రైలర్లో.. మనకు థియేటర్లలో వస్తున్న పబ్లిక్ సర్వీస్ యాడ్స్ అందరూ చూసే ఉంటారు. అన్ని థియేటర్లలో.. అన్ని సినిమాలకు, అన్నీ షోలకు ముందు ఈ యాడ్ ప్లే అవుతుంది. ఇదే యాడ్‌ను జనమంతా చూసే విధంగా చేస్తే ఎలా ఉంటుందని టీం హెడ్‌ను అడుగుతున్నాడు ఫహద్ ఫాసిల్.ఆ తర్వాత కొత్త ఫోన్, కొత్త కారు, పెద్ద ఇల్లు.. ఇవన్నీ వాటికి సమాధానం.. అంటున్నాడు. సినిమా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ చుట్టూ ఉండబోతుందంటూ సస్పెన్స్ లో పెడుతూ కట్ చేసిన ట్రైలర్ సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తోంది.
ధూమమ్ ట్రైలర్..
It’s U/A for #Dhoomam 🔥
Get ready for a fiery thrill ride in theatres from June 23rd!#FahadhFaasil @pawanfilms #VijayKiragandur @aparnabala2 @hombalefilms @PrithvirajProd @HombaleGroup @ChaluveG @Poornac38242912 #PreethaJayaraman @AneesNadodi @roshanmathew22… pic.twitter.com/5wJVaEdH3z
— Hombale Films (@hombalefilms) June 13, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

