వరుస విజయాలతో దూసుకెళుతున్న అనీల్ రావిపూడి రెండేళ్ల క్రితం సంక్రాంతి కానుకగా ఎఫ్ 2 అనే చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అంటూ వెంకటేష్‌తో, వరుణ్ తేజ్‌తో కామెడీ పండించాడు. ఎఫ్ 2 చిత్రం సినీ ప్రేక్షకులనే కాదు సెలబ్రిటీలని సైతం ఎంతగానో అలరించింది. కొద్ది రోజుల క్రితం ఎఫ్ 2కి సీక్వెల్‌గా ఎఫ్ 3 చిత్రం ప్రకటించాడు అనీల్ రావిపూడి. ఫన్, ఫ్రస్ట్రేషన్ అండ్ వెర్ ఫన్‌తో ఈ సినిమా ఉంటుంది.
ఎఫ్ 3 చిత్రం డబ్బులతో వచ్చే సమస్యల చుట్టూ తిరుగుతుందని టాక్. ఇది ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే ఖరారు చేసాడు ఈ దర్శకుడు. అయితే కథ కూడా డబ్బుల చుట్టూనే తిరగనుంది. ఎఫ్ 2లో భర్తల ఫ్రస్టేషన్ కనిపిస్తుంది. ఇక్కడ భార్యలు చేసే పనులతో భర్తలు ఎలాంటి ఇబ్బందులు పడతారు అనే కాన్సెప్టుతో ఎఫ్ 3 రానుందని ప్రచారం జరుగుతుంది.
భార్యలు మితిమీరిన ఖర్చులతో చేసిన అప్పులు తట్టుకోలేక.. వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి ఓ హోటల్ పెడతారు. అక్కడ్నుంచి వాళ్లకు ఎదురయ్యే సమస్యలు.. వాళ్లు పడేపాట్లని ఫన్నీగా చూపించనున్నారు దర్శకుడు అనీల్ రావిపూడి. తాజా సమాచారం మేరకు ఈ చిత్రంలో రేచీకటి ఉన్న వ్యక్తి పాత్రలో వెంకటేశ్, నత్తి ఉన్న వ్యక్తి పాత్రలో వరుణ్ నటిస్తున్నారని తెలిసింది. వీరిద్దరు పండించే కామెడీకి కడుపుబ్బ నవ్వుకోవల్సిందేనట.
‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెంకీ సరసన తమన్నా, వరుణ్‌కు జోడీగా మెహరీన్ కనిపిస్తారు. సునీల్, మురళీ శర్మ, అంజలి కీలక పాత్రలో నటిస్తున్నారు. సెకండాఫ్‌లో మురళీ శర్మ హంగామా మామూలుగా ఉండదట. వచ్చే సంక్రాంతికి ‘ఎఫ్ 3’ రిలీజ్ కానుంది.