వెంకటేష్(Venkates), వరుణ్ తేజ్(varun tej) ప్రధాన పాత్రలలో సూపర్ హిట్ దర్శకుడు అనీల్ రావిపూడి(Anil Ravipudi) తెరకెక్కిస్తున్న చిత్రం ఎఫ్ 3 సి. దాదాపు 80 కోట్ల బడ్జెట్ పెట్టేస్తున్నాడు నిర్మాత దిల్ రాజు. తొలి భాగం కేవలం 30 కోట్ల లోపు పూర్తి అయిపోయింది. ఆ సినిమా దాదాపు 130 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ప్రస్తుతం ఎఫ్ 3 షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది.
ఎఫ్ 3 సినిమా సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. ఈ క్రమంలో ‘ఎఫ్ 3’ రిలీజ్ డేట్‌ను చిత్రబృందం ఇటీవల ప్రకటించింది. వచ్చే ఏడాది అంటే 2022 ఫిబ్రవరి 25న సినిమాను థియేటర్లలో రిలీజ్ (F3 Movie Release Date) చేయనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. ఇక ఈ రోజు దీపావళి సందర్భంగా ఓ వీడియో విడుదల చేశారు.
కేబుల్ బ్రిడ్జిపై వెంకీ, వరుణ్ బాణా సంచా కాల్చుతూ ఎఫ్ 3 చిత్రం ఫిబ్రవరి 25న విడుదల కానుందని తెలియజేశారు. ఇదిలా ఉంటే తొలి భాగంతో పోలిస్తే సీక్వెల్ మరింత కామెడీ ఉంటుందని.. పొట్టలు చెక్కలయ్యేలా అనిల్ రావిపూడి ఈ సినిమా స్క్రిప్ట్‌ను రెడీ చేసారట. అంత బాగా స్క్రిప్ట్ వచ్చిందని అంటున్నారు.