Ananya Panday | అనన్యపాండే ఓ ఇంటిదైంది. అదేంటి? తెలియకుండానే పెళ్లెప్పుడు చేసుకుందనుకుంటున్నారా? ఇంటిదవ్వడమంటే పెళ్లవ్వడం కాదు. ముంబయిలో లగ్జరీ ఏరియాలో ఓ ఇంటిని కొనేసింది. రీసెంట్గా ఆ ఇంట్లోకి గృహప్రవేశం కూడా చేసింది. ఈ సందర్భంగా తన కొత్తింట్లో గృహప్రవేశానికి సంబంధించిన ఓ ఫొటోను తన ఎక్స్(ట్విటర్)లో పోస్ట్ చేసింది.
‘మీ అందరి ప్రేమ, ఆదరాభిమానాల వల్లే సొంత ఇల్లు కొనుక్కోగలిగాను. నా జీవితంలో నాది అనేది ఈ ఇల్లే. ఇది పూర్తిగా నా కష్టార్జితం. అందుకే చాలా ఆనందంగా ఉంది. నా ఇల్లు చూసి మా నాన్న చాలా ఆనందించారు. ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలయ్యాక ఆయనకు సొంత ఇల్లు కొనుక్కోవడానికి చాలా ఏళ్లు పట్టిందట. నేను త్వరగా ఆ టార్గెట్ రీచ్ అయ్యానని నాన్న చాలా గర్వంగా ఫీలయ్యారు’ అంటూ సంతోషం వ్యక్తం చేసింది అనన్య.