తారక్ కోసం పవర్ఫుల్ టైటిల్?
‘ఆర్ఆర్ఆర్'తో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్నారు తారక్. అందుకే సినిమాల సెలక్షన్లో కూడా ఆచితూచి ముందుకెళ్తున్నారాయన. పూర్తి స్థాయి బాలీవుడ్ సినిమా ‘వార్ 2’లో ఆయన నటించడానికి కారణం కూడా అదే. ఈ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులకు మరింత చేరువ కాబోతున్నారు తారక్.
‘ఆర్ఆర్ఆర్’తో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్నారు తారక్. అందుకే సినిమాల సెలక్షన్లో కూడా ఆచితూచి ముందుకెళ్తున్నారాయన. పూర్తి స్థాయి బాలీవుడ్ సినిమా ‘వార్ 2’లో ఆయన నటించడానికి కారణం కూడా అదే. ఈ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులకు మరింత చేరువ కాబోతున్నారు తారక్. ఈ ఏడాది ఆగస్ట్‌లోనే ‘వార్ 2’ విడుదల కానుంది. ఇటీవలే ప్రశాంత్‌నీల్ ‘డ్రాగన్’ షూటింగ్ కూడా మొదలైంది. ఇదిలావుంటే.. ఈ రెండు సినిమాల తర్వాత తారక్ చేయబోయే సినిమాపై ఆసక్తికరమైన అప్డేట్ ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నది.
‘డ్రాగన్’ తర్వాత తమిళ దర్శకుడు నెల్సన్ దర్శకత్వంలో తారక్ సినిమా చేయనున్నారని విశ్వసనీయ సమాచారం. ఈ సినిమాకు ‘రాక్’ టైటిల్‌ని కూడా నెల్సన్ ఖరారు చేశారట. పాన్ ఇండియా ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకొనే నెల్సన్ ఈ టైటిల్ పెట్టారని ఫిల్మ్ వర్గాల టాక్. తారక్ ‘డ్రాగన్’, నెల్సన్ ‘జైలర్ 2’ పూర్తయ్యాక ‘రాక్’ మొదలవుతుంట. 2026లో సెట్స్‌పైకి వెళ్లే ఈ సినిమాను సితార ఎంటైర్టెన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Robot Harassment | అమ్మాయిలను వేధించిన రోబో.. 16 ఏళ్ల బాలికను తాకుతూ అసభ్య చేష్టలు!
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
Congenital Birth: ఒడిశాలో రెండు తలలతో పుట్టిన మగ శిశువు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

