‘అర్జున్‌రెడ్డి’ ఆఫర్ వొద్దనుకున్నా!
తెలుగు చిత్రసీమలో ‘అర్జున్‌రెడ్డి’ చిత్రం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. కల్ట్ మూవీగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. విజయ్ దేవరకొండకు తిరుగులేని స్టార్‌డమ్‌ను తీసుకురావడంతో పాటు దర్శకుడు సందీప్ రెడ్డి వంగాను స్టార్ డైరెక్టర్‌ను చేసింది.
తెలుగు చిత్రసీమలో ‘అర్జున్‌రెడ్డి’ చిత్రం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. కల్ట్ మూవీగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. విజయ్ దేవరకొండకు తిరుగులేని స్టార్‌డమ్‌ను తీసుకురావడంతో పాటు దర్శకుడు సందీప్ రెడ్డి వంగాను స్టార్ డైరెక్టర్‌ను చేసింది. ఈ సినిమా బాలీవుడ్లో ‘కబీర్‌సింగ్’ పేరుతో రీమేక్ అయిన విషయం తెలిసిందే. షాహిద్‌కపూర్ హీరోగా నటించారు. తన కెరీర్లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని షాహిద్‌కపూర్ తొలుత తిరస్కరించాడట. అనంతరం తన భార్య సలహాతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడట. ఈ విషయాన్ని షాహిద్‌కపూర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
ఆయన మాట్లాడుతూ ‘అసలు అలాంటి పాత్రలో ప్రేక్షకులు నన్ను యాక్సెప్ట్ చేస్తారో లేదో అని సందేహించాను. ఆ కథలోని అంశాలను చూపించడానికి చాలా ధైర్యం కావాలి. కొన్ని నెగెటివ్ అంశాలున్నా ఆ పాత్ర అంటే నాకు చాలా ఇష్టం. దర్శకుడు సందీప్‌రెడ్డి కథ చెప్పినప్పుడు సున్నితంగా తిరిస్కరించాను. ఆ తర్వాత నా భార్యతో చర్చించినప్పుడు ‘ప్రేమకథా చిత్రాల్లో ప్రేక్షకులు నిన్ను బాగా ఇష్టపడతారు. నీ కెరీర్లో విభిన్న చిత్రమవుతుంది’ అంటూ ప్రోత్సహించింది’ అని చెప్పారు షాహిద్‌కపూర్. 2019లో హిందీలో విడుదలైన ‘కబీర్‌సింగ్’ చిత్రం 350కోట్ల వసూళ్లను సాధించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
Woman poses as TTE on train | రైలులో టీటీఈగా నటించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
వృథాగా పోతున్న రాంపురం పెద్ద చెరువు నీరు
India Won: కివీస్‌తో తొలి వన్డే.. 5 వికెట్ల తేడాతో ఇండియా గెలుపు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

