RAPO23 | రామ్ పోతినేని దర్శకత్వంలో సినిమా.. కెమెరామెన్‌గా జాతీయ అవార్డు గ్రహీత తిరు!
Ram Pothineni | టాలీవుడ్ హీరో రామ్ పోతినేని త్వరలో ఒక సరికొత్త అవతారంలో కనిపించబోతున్నారు. ఆయన హీరోగా నటిస్తూ, స్వయంగా కథ-స్క్రీన్‌ప్లే రాసి, దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'రాపో 23' (RAPO23).
Ram Pothineni | టాలీవుడ్ హీరో రామ్ పోతినేని త్వరలో ఒక సరికొత్త అవతారంలో కనిపించబోతున్నారు. ఆయన హీరోగా నటిస్తూ, స్వయంగా కథ-స్క్రీన్‌ప్లే రాసి, దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రాపో 23’ (RAPO23). ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌లోకి జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ (కెమెరామెన్) తిరు అధికారికంగా ఎంట్రీ ఇచ్చారు. గతంలో ఆయన ‘క్రిష్ 3’, ‘జనతా గ్యారేజ్’, ‘గేమ్ ఛేంజర్’ వంటి పెద్ద సినిమాలకు అద్భుతమైన విజువల్స్ అందించారు. ఇప్పుడు రామ్ తెరకెక్కించబోయే ఈ సరికొత్త ‘నియో-నోయిర్’ క్రైమ్ డ్రామాను కూడా తిరు తన కెమెరా మాయాజాలంతో మరింత అందంగా చూపించబోతున్నారు.
రామ్ పోతినేని మార్క్ యాక్షన్, ఎమోషన్స్ ఉన్న ఈ కథను తిరు తన విజువల్స్‌తో నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లనున్నారు. ఒకవైపు హీరోగా నటిస్తూనే, మరోవైపు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం బాధ్యతలను రామ్ ఒక్కడే చూసుకోవడం విశేషం. ఈ సినిమాను ‘రాపో సినిమాటిక్స్’ బ్యానర్‌పై రామ్ సోదరుడు కృష్ణ పోతినేని భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రామ్ మొదటిసారి మెగాఫోన్ పట్టి దర్శకత్వం వహిస్తుండటం, దానికి తోడు తిరు లాంటి స్టార్ టెక్నీషియన్ తోడవడంతో ఈ సినిమాపై టాలీవుడ్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

