ప్రేమకథా చిత్రాల్లో అద్భుతంగా ఒదిగిపోతాడు యువ హీరో దుల్కర్ సల్మాన్. ‘సీతారామం’ వంటి ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీతో ఆయన తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తాజా సమాచారం ప్రకారం దుల్కర్ సల్మాన్ తెలుగులో మరో ప్రేమకథకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. న్యూఏజ్ లవ్‌స్టోరీగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై ‘దసరా’ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారని సమాచారం.
దుల్కర్ సల్మాన్ సరసన కథానాయికగా బాలీవుడ్ భామ నటించబోతున్నట్లు తెలిసింది. దుల్కర్ సల్మాన్ నటించిన గత ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా నేటి ట్రెండ్‌ను ప్రతిబింబిస్తూ ఈ సినిమా సాగుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ తెలుగులో ‘లక్కీ భాస్కర్’ చిత్రంలో నటిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటున్నది.