నువ్వు గుద్దితే ముద్దు పెట్టినట్టున్నదే..
వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ప్రేమకథాచిత్రం ‘డ్రింకర్ సాయి’. ‘బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్' అనేది ఉపశీర్షిక. ధర్మ, ఐశ్వర్యశర్మ జంటగా నటిస్తున్నారు.
వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ప్రేమకథాచిత్రం ‘డ్రింకర్ సాయి’. ‘బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్’ అనేది ఉపశీర్షిక. ధర్మ, ఐశ్వర్యశర్మ జంటగా నటిస్తున్నారు. కిరణ్ తిరుమలశెట్టి దర్శకుడు. బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మాతలు. ఈ నెల 27న సినిమా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా శనివారం ఈ సినిమాలోని పాటను విడుదల చేశారు.
‘నువ్వు గుద్దితే ముద్దు పెట్టినట్టున్నదే.. నువ్వు తన్నితే వెన్నె పూసినట్టున్నదే.. నువ్వు రక్కితే చక్కిలిగింత పుడుతున్నదే.. నువ్వు తొక్కితే థాయ్ మసాజ్ చేసినట్టున్నదే.. ’ అంటూ సాగే ఈ పాటను చంద్రబోస్ రాయగా, శ్రీవసంత్ స్వరపరిచారు. జెస్సీ గిఫ్ట్ ఆలపించారు.
హీరోయిన్ని టీజ్ చేస్తూ హీరో పాడే ఈ పాట సినిమాలో హైలైట్గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, ఎస్.ఎస్.కాంచి తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: ప్రశాంత్ అంకిరెడ్డి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

