Don’t Trouble the Trouble | ఫహాద్ ఫాజిల్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ టీజర్ విడుదల.. మేజిక్, మిస్టరీ, హారర్ మేళవింపుతో ఆసక్తి పెంచిన మూవీ!
Don’t Trouble the Trouble | మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో తొలిసారిగా పూర్తి స్థాయి తెలుగు పాత్రలో నటిస్తున్న చిత్రం 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'. విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఫహాద్ ఈసారి మరో ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి శశాంక్ యేలేటి దర్శకుడిగా పరిచయం అవుతుండగా, 'బాహుబలి' నిర్మాత శోభు యార్లగడ్డతో పాటు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Don’t Trouble the Trouble | మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో తొలిసారిగా పూర్తి స్థాయి తెలుగు పాత్రలో నటిస్తున్న చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఫహాద్ ఈసారి మరో ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి శశాంక్ యేలేటి దర్శకుడిగా పరిచయం అవుతుండగా, ‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డతో పాటు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం చిత్రబృందం అధికారికంగా టీజర్‌ను విడుదల చేసింది. విడుదలైన కొద్ది సేపటికే టీజర్ సోషల్ మీడియాలో మంచి స్పందన అందుకుంటూ సినిమాపై అంచనాలను పెంచుతోంది.
టీజర్‌ను పరిశీలిస్తే.. ఫహాద్ ఫాజిల్ ఒక మెజీషియన్ పాత్రలో కనిపిస్తున్నారు. చిన్నారి ముందు వరుసగా మ్యాజిక్ ట్రిక్స్ చేస్తూ ఆమెను అలరిస్తుంటాడు. అయితే ఆ ఆటలో భాగంగా చిన్నారిని మాయంచేసే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ తర్వాత ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. సాధారణంగా కనిపించిన ఆ చిన్నారి ఒక్కసారిగా వింతగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. ఆత్మ ఆవహించినట్లు విచిత్రమైన శక్తులను ప్రదర్శిస్తూ మెజీషియన్కే షాక్ ఇస్తుంది. పరిస్థితి చేతికి అందకుండా పోవడంతో భయపడిన ఫహాద్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఆ చిన్నారి అతడిని వెంటాడుతూ కనిపించడం టీజర్‌ను మరింత ఉత్కంఠభరితంగా మార్చింది.
హారర్, ఫాంటసీ, థ్రిల్లర్ అంశాలను కలగలిపి రూపొందించిన ఈ టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా చివర్లో వచ్చే విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్‌తో పాటు సారా పాలేకర్, సౌరభ్ సచ్దేవ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వినూత్న కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో నటీనటుల పాత్రలు కూడా ప్రత్యేకంగా ఉండనున్నట్లు టీజర్ ద్వారా స్పష్టమవుతోంది. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్రాన్ని సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రం ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

