‘ఒక సీరియల్ కిల్లర్ నడిరోడ్డుమీద జనాన్ని గుడ్డిగా షూట్ చేస్తున్నాడు. ఆల్రెడీ రోడ్‌మీద చాలామంది చనిపోయారు. అతన్నెవరూ ప్రతిఘటించలేని పరిస్థితి. ఇంతలో ఓ పోలీస్ ఆఫీసర్ ధైర్యంగా ముందుకొచ్చి ఆ కిల్లర్‌ని కాల్చాడు. మళ్లీ అతను గన్ని రీలోడ్ చేసుకునే లోపు, ఆ కిల్లర్ పోలీస్ ఆఫీసర్ని కాల్చాడు. ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ గన్ నీ చేతిలో వుంది. అండ్ యు హ్యావ్ ఏ క్లీన్ షాట్.. ఏం చేస్తారు?’ ఏంటి?” ఏ సినిమాలోని సన్నివేశం ఇది అనుకుంటున్నారా? తమిళ అగ్ర నటుడు విజయ్ హీరోగా నటిస్తున్న ‘లియో’ చిత్రం ట్రైలర్‌ని శుక్రవారం విడుదల చేశారు.
ఈ ట్రైలర్లో విజయ్ వాయిస్ ఓవర్ ఇది. ఆద్యంతం ఉత్కంఠకు గురిచేసే యాక్షన్ ఎపిసోడ్స్‌తో ఈ ట్రైలర్ సాగింది. సినిమా అంతకు మించిన స్థాయిలో ఉంటుందని, విజయ్, అర్జున్, సంజయ్‌దత్ పాత్రలు డెడ్లీగా ఉంటాయని, త్రిష పాత్ర హైలైట్‌గా నిలిచే ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్‌కి కొదవుండదని మేకర్స్ చెబుతున్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం, అనిరుధ్ సంగీతం, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ త్వరలో బాక్సాఫీస్ దగ్గర మళ్లీ మ్యాజిక్ చేయనున్నాయి. అక్టోబర్ 19న లియో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రియాఆనంద్, మిస్కిన్, మన్సూర్ ఆలీఖాన్, మథ్యూథామస్ తదితరులు ఈ చిత్రంలో నటించారు.