Don-3 | డాన్ యూనివర్స్‌లోకి కియారా అద్వానీ..! గ్రాండ్ వెల్కమ్ చెప్పిన టీమ్..
Don-3 | బాలీవుడ్ దర్శకుడు ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం డాన్-3. ఈ మూవీలో షారుఖ్ ఖాన్ ప్లేస్‌లో రణ్వీర్ సింగ్ హీరోగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా కియారా అద్వానీ కనిపించనున్నది.
Don-3 | బాలీవుడ్ దర్శకుడు ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం డాన్-3. ఈ మూవీలో షారుఖ్ ఖాన్ ప్లేస్‌లో రణ్వీర్ సింగ్ హీరోగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా కియారా అద్వానీ కనిపించనున్నది. ఈ విషయాన్ని విషయాన్ని ఫర్హాన్ అక్తర్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ‘డాన్ యూనివర్స్‌లోకి స్వాగతం కియారా అద్వానీ’ అంటూ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేస్తూ డైరెక్టర్‌తో పాటు నిర్మాతలు స్వాగతం పలికారు. ఇక కియారా తొలిసారిగా రణ్వీర్ సింగ్‌తో బిగ్ స్క్రీన్‌పై రొమాన్స్ చేయనున్నది.
ఫర్హాన్ అక్తర్ డాన్-3 చిత్రాన్ని గతేడాది ప్రకటించారు. డాన్ ఫ్రాంచైజీలోని తొలి రెండు చిత్రాల్లో షారుఖ్ ఖాన్ నటించిన విషయం తెలిసిందే. డాన్-3లో కొత్త రణ్వీర్ సింగ్ కనిపిస్తాడని ప్రకటించారు. ఆ తర్వాత ప్రియాంక చోప్రా స్థానంలో ఎవరిని తీసుకుంటారనే చర్చ సాగింది. షారుఖ్ – ప్రియాంక జోడి ప్రేక్షకులను అలరించింది. ఇక డాన్-3 షూటింగ్ ఈ ఏడాది ఆగస్టు నెలలో ప్రారంభించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
అదే సమయంలో చిత్రంలోని మిగతా పాత్రలకు సైతం నటీనటుల ఎంపిక సైతం కొనసాగుతుందని తెలుస్తున్నది. ఇక ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అయితే, చిత్రబృందం దీనిపై స్పందించలేదు. త్వరలోనే అఫీషియల్‌గా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉండగా.. కియారా అద్వానీ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నది. అలాగే, హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీర్ నటిస్తున్న వార్-2 చిత్రంలోనూ కనిపించనున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

