F3 కోసం అనిల్ రావిపూడి పారితోషికం తీసుకోలేదా..?
Anil Ravipudi Remuneration | టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ దర్శకుల లిస్టులో అనిల్ రావిపూడి ముందున్నాడు ఇప్పుడు. వరుస విజయాలతో జోరు మీదున్న ఈ యంగ్ డైరెక్టర్.. ఎఫ్ 3 సినిమాతో ఈ వారం బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాడు. మే 27 న విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. వెంకటేశ్, వరుణ్ తేజ్ లాంటి హీరోలున్నా.. కేవలం అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డు కారణంగా ఈ సినిమా బిజినెస్ భారీగా జరిగింది. దాదాపు 80 కోట్లకు ఈ సినిమాను అమ్మినట్లు ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం నటీనటులు భౄరీగా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
వెంకటేశ్ 12 కోట్లు.. వరుణ్ తేజ్ 8 కోట్లు సహా.. హీరోయిన్లు, సహా నటులు కూడా భారీగానే పారితోషికం అందుకున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి రెమ్యునరేషన్ పై ముందు నుంచి కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అనిల్ ట్రాక్ రికార్డ్ చూసిన తర్వాత ఈ సినిమాకు కచ్చితంగా రూ.15 కోట్లకు పైగానే పారితోషికం అందుకొని ఉంటారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఎఫ్ 3 సినిమా కోసం అసలు అనిల్ రావిపూడి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. రెమ్యునరేషన్‌కు బదులు లాభాల్లో వాటా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
నిజానికి ఇలా చేస్తే నిర్మాతలకు కూడా చాలా లాభం. సినిమాకు ముందు ఇచ్చే రెమ్యునరేషన్ బాధలు తప్పుతాయి. విడుదలైన తర్వాత జరిగే బిజినెస్‌లో హ్యాపీగా వాటా తీసుకుంటారు. ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు ఇప్పుడు ఇదే చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ పదేళ్లుగా హారిక హాసిని క్రియేషన్స్ తో సినిమాలు చేయడానికి కారణం ఇదే. ఇప్పుడు అనిల్ రావిపూడి కూడా దిల్ రాజుతో ఇలాంటి రిలేషన్ మెయింటెయిన్ చేయాలని చూస్తున్నాడు. ఆ తర్వాత కూడా ఆయన ఇదే నిర్మాతతో సినిమాలు చేయాలనే ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇలా చేస్తే మామూలుగా తీసుకునే రెమ్యునరేషన్ కంటే ఎక్కువగా వస్తుంది. రేపు ఎఫ్ 3 విడుదలై విజయం సాధించిందంటే అనిల్ రావిపూడి వాటా కింద దాదాపు రూ.25 కోట్లకు పైగానే రావడం ఖాయం అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
Read More :
“NBK 108 Heroine | ‘NBK 108’ హీరోయిన్ ఫైనల్..మళ్లీ ఆ బ్యూటీనే..?”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

