F3 Movie | ఎఫ్ 3 క్రేజీ న్యూస్..ఈ మూడు పాత్రల మధ్య పెద్ద ట్విస్ట్ ఉండబోతుందట..!
తన కామెడీతో ప్రేక్షకులకు వినోదాన్ని అందించడమే కాదు..భావోద్వేగాలతోపాటు ఓ సందేశాన్ని కూడా ఇచ్చేలా ప్లాన్ చేసుకుంటాడు స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.అనిల్ రావిపూడి (Anil Ravipudi) తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఎఫ్ 3 (F3).
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఎఫ్ 3 (F3). వెంకటేశ్ (Venkatesh), వరుణ్ తేజ్ (Varun Tej), తమన్నా (Tamannaah), మెహరీన్ కౌర్ (Mehreen kaur) హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా అనిల్ రావిపూడి అండ్ టీం మే 27న థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతుంది.
తన కామెడీతో ప్రేక్షకులకు వినోదాన్ని అందించడమే కాదు..భావోద్వేగాలతోపాటు ఓ సందేశాన్ని కూడా ఇచ్చేలా ప్లాన్ చేసుకుంటాడు అనిల్ రావిపూడి. ఎఫ్2తో ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అంటూ అలరించిన ఈ డైరెక్టర్ ఇపుడు అదే ప్రాంఛైజీలో ఎఫ్3 తో వస్తున్నాడు. ఎప్పటిలాగే డబ్బుకు సంబంధించి ఓ మంచి సందేశాన్ని ఇవ్వడమే కాదు..ప్రేక్షకులు ఊహించని మలుపులు, ట్విస్టులు ఉండబోతున్నాయట.
లేటెస్ట్ టాక్ ప్రకారం సినిమాలో ప్రధానంగా మూడు పాత్రల చుట్టూ ఓ పెద్ద ట్విస్టు ఉండనుండగా..సెకండాఫ్లో ఆ ట్విస్ట్ ఏంటో తెలియనుందని ఇన్సైడ్ టాక్. ఇంతకీ ఆ క్రేజీ పాత్రలెవరనే కదా మీ డౌటు. తమన్నా, సోనాల్ చౌహాన్, మురళీశర్మ మధ్య ఆ ట్విస్ట్ ఉండనుందట. తమన్నా ఇప్పటికే ఎఫ్ 2లో కనిపించగా..తొలిసారి సోనాల్ చౌహాన్, మురళీ శర్మ ఫన్ ప్రాంఛైజీ ఎఫ్ 3తో భాగస్వామ్యం అవుతున్నారు.
ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై శిరీష్ నిర్మిస్తున్నారు. సోనాల్ చౌహాన్, సునీల్, అన్నపూర్ణమ్మ, వెన్నెల కిశోర్, ప్రకాశ్ రాజ్, రాజేంద్రప్రసాద్ ఇతర నటీనటులు కీ రోల్స్ పోషిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మరోసారి మ్యూజిక్ అందిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

