Chatrapathi | టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) ఛత్రపతి హిందీ రీమేక్‌తో బాలీవుడ్(Bollywood) ఎంట్రీ ఇస్తున్నాడని తెలిసిందే. డైరెక్టర్ వివి వినాయక్ (V V Vinayak) సేమ్ టైటిల్ ఛత్రపతి (Chatrapathi)తో తెరకెక్కిస్తున్నాడు. ఛత్రపతి మే 12న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా రన్ టైంకు సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చింది. ఛత్రపతి రన్ టైం 123 నిమిషాలు. అంటే రెండు గంటల మూడు నిమిషాలు.
ఒరిజినల్ వెర్షన్ నిడివి 2:45 నిమిషాలు. కాగా రెండు సినిమాల మధ్య 42 నిమిషాలు తేడా ఉంది. మరి ఛత్రపతిని నార్తిండియా ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా స్టైలిష్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్న వివి వినాయక్ హిందీ వెర్షన్లో ఏఏ సన్నివేశాలను తీసేశాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. మరికొన్ని గంటల్లో ఈ విషయంపై క్లారిటీ రానుంది.
ఇప్పటికే విడుదలైన ఛత్రపతి టీజర్, ఛత్రపతి ట్రైలర్స్ మాస్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో అందరినీ ఆకట్టుకునేలా సాగుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఛత్రపతితో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇమేజ్ మరింత పెరిగిపోవడం ఖాయమని తాజా ట్రైలర్ చెప్పేస్తుంది. ఛత్రపతిలో బాలీవుడ్ లెజెండరీ కమెడియన్ జానీ లివర్ (Johny Lever) కీ రోల్ పోషిస్తున్నాడు.
ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్‌పై బాలీవుడ్ నిర్మాత జయంతి లాల్ గడా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ భామ నుస్రత్ బరూచా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రంలో భాగ్య శ్రీ, శరద్ కేల్కర్, శివమ్ పాటిల్, ఫ్రెడ్డి దారువాలా, రాజేంద్ర గుప్తా, సహిల్ వైద్ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి తనిష్క్ బాఘ్చీ సంగీతం అందిస్తున్నాడు.
ఛత్రపతి ట్రైలర్..
ఛత్రపతి టీజర్..