రాజకీయ పార్టీల జోక్యం వద్దు

‘రెండు ప్యానల్స్ మధ్య జరుగుతున్న యుద్ధం కాదిది. ఈ ఎన్నికల్ని పోటీగా భావించవొద్దు’ అని అన్నారు ప్రకాష్‌రాజ్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీచేస్తున్న ప్రకాష్‌రాజ్ సోమవారం ఉదయం తన ప్యానల్‌తో కలిసి నామినేషన్‌ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా ప్రకాష్‌రాజ్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘ ప్రతి విషయంలో మేము ఒక అడుగు ముందే ఉన్నాం. ఇవి ఎన్నికలు మాత్రమే. రెండు ప్యానల్స్ మధ్య పోటీ కాదు. తొమ్మిది వందలకుపైగా సభ్యులు తమ నాయకుడిని ఎన్నుకునే సమయం ఇది. గెలిపించే.. ఓడించే హక్కు, బాధ్యత సభ్యులకే ఉంది. సవ్యంగా, దూషణలు, ఆరోపణలు లేకుండా ఎన్నికలు జరగాలి. మన కోసం ‘మా’..‘ మా’ కోసం మనం అనే నినాదంతో అందరి ముందుకొచ్చాం. మేము పనిచేస్తూ పదిమందితో పనిచేయిస్తూ ప్రతి ఒక్కరిని కలుపుకొనిపోతాం. త్వరలో మా ప్రణాళికలేమిటో వివరిస్తాం. ఈ ఎన్నికల్లో రాజకీయ జోక్యం ఎవరి వల్ల జరుగుతుందో, ఎవరు చేయిస్తున్నారో నాకు తెలియదు. విరుద్ధమైన అభిప్రాయాలు, సిద్ధాంతాలు ఉన్నా.. మేమంతా ‘మా’ సభ్యులమే. మా మధ్య జరుగుతున్న ఎన్నికలు మాత్రమే ఇవి. రాజకీయ పార్టీల జోక్యం వద్దు’ అని అన్నారు. అలాగే పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలపై ప్రకాష్‌రాజ్ స్పందిస్తూ ‘పవన్‌కల్యాణ్ మంచి రాజకీయ నాయకుడు. తన సిద్ధాంతాలకు అనుగుణంగా దేశం కోసం పోరాడుతున్నారు. అసోసియేషన్ పరంగా ఆయన్ని మేము ఓ సభ్యుడిగానే భావిస్తున్నాం. తమలో ఉన్న ప్రేమ, ఆవేశం, సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంటుంది. వాళ్లను మాట్లాడనివ్వాలి. అసోసియేషన్‌కు సేవ చేయడమే మా లక్ష్యం. వాటి గురించి మాత్రమే మాట్లాడుతాం. రాజకీయ విషయాలపై అనవసరపు చర్చలు వద్దనుకుంటున్నాం’ అని తెలిపారు. జనరల్ సెక్రటరీగా పోటీచేస్తున్న జీవిత మాట్లాడుతూ ‘ప్రధానమంత్రి ఎన్నికల కంటే ఎక్కువగా ‘మా’ ఎలక్షన్స్ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఎంతో ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ఎన్ని సమస్యలు, అభిప్రాయభేదాలు వచ్చినా మేమంతా ఒకే కుటుంబం. ఎన్నికల సమయంలో పోటీ సహజం కానీ అది ఆరోగ్యకరంగా ఉండాలి. అప్పుడే అందరికీ గౌరవప్రదంగా ఉంటుంది. ఇండస్ట్రీకి అప్రతిష్ట వచ్చేలా ఎవరూ మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. ఇతరుల్ని కించపరుస్తూ వారి వ్యక్తిగత జీవితాల గురించి చులకనగా మాట్లాడుతూ మనల్ని మన దిగజార్చుకోకూడదు. గెలుపు కోసం పోరాడటంలో తప్పులేదు. కానీ ఆ పోరాటం గౌరవంగా ఉండాలి. ఇండస్ట్రీలో విభజన అనేది కేవలం ఎన్నికల వరకే ఉంటుంది. గెలిచినా, ఓడినా అందరూ కలిసే పనిచేయాలి. ప్రకాష్‌రాజ్ ప్యానల్‌కు తాను సపోర్ట్ చేస్తున్నట్లు, ఆయన్ని అధ్యక్షుడిని చేయమని చిరంజీవి ఎక్కడ చెప్పలేదు’ అని తెలిపింది. అక్టోబర్ 10న ‘మా’ ఎన్నికలు జరుగనున్నాయి.
సీవీఎల్ నరసింహారావు నామినేషన్ దాఖలు
‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీచేస్తున్న సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహారావు సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు ఆయన నామినేషన్ పత్రాలను అందజేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- MAA Election
- Prakash raj
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

