చందమామ కథలాంటి సినిమా
హీరో కళ్యాణ్ రామ్ నటిస్తున్న సోషియో ఫాంటసీ సినిమా ‘బింబిసార’. సంయుక్తా మీనన్, క్యాథరీన్ ట్రెసా నాయికలు. దర్శకుడు వశిష్ఠ్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ.కె నిర్మిస్తున్నారు. ఆగస్టు 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ సంయుక్తా మీనన్ మాట్లాడుతూ…‘కళకు విలువ ఇచ్చే ఇండస్ట్రీ టాలీవుడ్. నేను తెలుగులో నటించిన మొదటి చిత్రమిది. రెండు రోజుల షూటింగ్ తర్వాత ఈ చిత్రంలో నటిస్తున్నందుకు థ్యాంక్స్ అంటూ కళ్యాణ్ రామ్ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. ఆర్టిస్టులంటే ఈ టీమ్‌కు ఎంత గౌరవం ఉందో అప్పుడే తెలిసింది. ట్రైలర్‌లాగే సినిమా కూడా మీకు బాగా నచ్చుతుంది’ అని చెప్పింది. “రుద్రమదేవి’ తర్వాత నేను నటిస్తున్న పీరియాడిక్ ఫిల్మ్ ఇది.
ఇందులో ఐరా అనే పాత్రలో నటించాను. ఈ క్యారెక్టర్లో నటించడాన్ని ఆస్వాదించాను’ అని నాయిక క్యాథరీన్ ట్రెసా చెప్పింది. దర్శకుడు వశిష్ఠ్ మాట్లాడుతూ…‘ఇలాంటి భారీ చిత్రాన్ని రూపొందించే ధైర్యాన్నిచ్చింది హీరో కళ్యాణ్ రామ్. సందేహించిన ప్రతి సందర్భంలో నువ్వు చేయగలవు అని ప్రోత్సహించారు. మా బింబిసారుడు యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో ఆగస్టు 5న థియేటర్లో చూస్తారు’ అని అన్నారు. కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ..‘చందమామ కథల్ని చదువుకున్నాం, పెద్దవాళ్లు చెప్పగా విన్నాం, తెరపై చూశాం. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెలుగులో ఎన్నో అందమైన కథలు తెరకెక్కాయి. వాటిని మీరంతా ఆదరించారు. టైమ్ ట్రావెల్‌తో సాగే అలాంటి అందమైన సినిమా ఇది. మీరంతా ఇష్టపడే చిత్రమవుతుంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
iQOO | 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్.. 7 ఇంచుల భారీ డిస్ప్లే కూడా!
Rajeev Kanakala | ఎన్టీఆర్ అప్పుడే స్టార్ అవుతాడని చెప్పా, 25 ఏళ్లు గడిచినా మారలేదు.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Dakshinamukhi Anjaneya Swamy | పార్డి (కె) గ్రామంలో ముగిసిన అఖండ హరినామ తాళ సప్తహ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

