యాక్షన్ ఎంటర్టైనర్గా కుంభ
వి.సముద్ర స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘కుంభ’. విజయ్‌రామ్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ దైవసన్నిధానంలో ఘనంగా జరిగింది.
వి.సముద్ర స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘కుంభ’. విజయ్‌రామ్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ దైవసన్నిధానంలో ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత డీఎస్‌రావు క్లాప్ ఇవ్వగా, సముద్ర సతీమణి విజయలక్ష్మి కెమెరా స్విచాన్ చేశారు. తొలి సన్నివేశానికి చంద్రమహేశ్, దేవి ప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు.
సినిమా బాగా రావాలని, మంచి విజయం సాధించాలని అతిథులంతా ఆకాంక్షించారు. ‘కథలను నమ్మి కొత్తవాళ్లతో అయిదు సినిమాలు చేస్తున్నా. అందులో ‘కుంభ’ ఒకటి. పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్న సినిమా ఇది.’ అని సముద్ర తెలిపారు.
అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాత సముద్రకు హీరో విజయ్‌రామ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా చిత్ర యూనిట్ సభ్యులందరూ మాట్లాడారు. సూరజ్ ఆదిత్యసింగ్, జ్యోతి యాదవ్, రవి జంగ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శ్రీవెంకట్, సంగీతం: వరంగల్ శ్రీను.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

