Nag Ashwin | మూడు ప్రపంచాల కథ కల్కి: నాగ్అశ్విన్
‘కల్కి 2898’ సినిమా కథ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు దర్శకుడు నాగ్అశ్విన్. మూడు విభిన్న ప్రపంచాల మధ్య నడిచే ఈ కథ ప్రేక్షకులకు ఆద్యంతం కొత్త అనుభూతిని అందిస్తుందని తెలిపారు. ప్రభాస్ కథానాయకుడిగా ఆయన దర్శకత్వంలో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Nag Ashwin | ‘కల్కి 2898’ సినిమా కథ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు దర్శకుడు నాగ్అశ్విన్. మూడు విభిన్న ప్రపంచాల మధ్య నడిచే ఈ కథ ప్రేక్షకులకు ఆద్యంతం కొత్త అనుభూతిని అందిస్తుందని తెలిపారు. ప్రభాస్ కథానాయకుడిగా ఆయన దర్శకత్వంలో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో ‘వరల్డ్ ఆఫ్ కల్కి 2898 ఏడీ-2’ పేరుతో దర్శకుడు నాగ్అశ్విన్ ఓ వీడియోను పంచుకున్నారు. ఇందులో ‘కల్కి’ కథా సారాంశాన్ని వివరించారు. కాశీ, కాంప్లెక్స్, శంబాలా అనే మూడు ప్రపంచాల నడుమ ఈ కథ నడుస్తుందని తెలిపారు. ఆయన మాట్లాడుతూ ‘గంగానది ఒడ్డున ఉన్న కాశీని ప్రపంచంలోనే మొదటి నగరమని అనేక శాసనాల్లో పేర్కొన్నారు. మన నాగరికత పుట్టుక కూడా ఇక్కడ నుంచే ఆరంభమైందని చెబుతారు.
ఒకవేళ కాశీనే మానవాళికి చివరి నగరమైతే ఎలా ఉంటుందనే ఊహ నుంచి ఈ కథ రాసుకున్నా. కాశీపైన తిరగేసిన పిరమిడ్ ఆకారంలో ఓ నిర్మాణం ఉంటుంది. దానిని కాంప్లెక్స్ అంటారు. అదొక స్వర్గంలాంటిది. కాంప్లెక్స్‌లో ఉండే వనరులను కాశీ ప్రజలకు అందకుండా కొందరు నియంత్రిస్తుంటారు.
ఈ రెండు ప్రపంచాలతో పాటు శంబాలా అనే మరో ప్రపంచం ఉంటుంది. ఇది కల్కి కథకు అనుసంధానమై ఉంటుంది. ఇక్కడ నుంచే విష్ణువు చివరి అవతారం కల్కి వస్తుంది. ఈ మూడు ప్రపంచాల మధ్య సంబంధం ఏమిటన్నదే ‘కల్కి’లో ఆసక్తికరమైన అంశం’ అని నాగ్అశ్విన్ తెలిపారు. అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పడుకోన్, దిశా పటానీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ నిర్మిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

