ప్రేమకు నేనిచ్చే నిర్వచనమే ఈ ఉషాపరిణయం
నాకిష్టమైన టైటిల్ ‘ఉషాపరిణయం’. ఈ టైటిల్‌తో సినిమా చేయాలనేది నా చిరకాల వాంఛ. అది ఇప్పటికి నెరవేరింది. ఇందులో కథానాయిక పేరు ఉషా. ఆమె పెళ్లి చుట్టూ తిరిగే కథ ఇది.
‘నాకిష్టమైన టైటిల్ ‘ఉషాపరిణయం’. ఈ టైటిల్‌తో సినిమా చేయాలనేది నా చిరకాల వాంఛ. అది ఇప్పటికి నెరవేరింది. ఇందులో కథానాయిక పేరు ఉషా. ఆమె పెళ్లి చుట్టూ తిరిగే కథ ఇది. ‘లవ్ ఈజ్ బ్యూటిఫుల్’ అనేది క్యాప్షన్‌గా పెట్టాను. ఎందుకు పెట్టానో సినిమాచూస్తే మీకే అర్థమవుతుంది. ప్రేమకు నేనిచ్చే నిర్వచనమే ఈ సినిమా.’ అని దర్శకుడు కె.విజయభాస్కర్ అన్నారు. స్వీయదర్శకత్వంలో ఆయన నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఉషాపరిణయం’. కె.విజయభాస్కర్ తనయుడు శ్రీకమల్ ఇందులో కథానాయకుడు. తాన్వీ ఆకాంక్ష కథానాయిక. ఆగస్ట్ 2న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా కె.విజయభాస్కర్ మీడియాతో ముచ్చటించారు. ‘
ఇది ఓ కుర్రాడి కథ. కొడుకు కోసం రాసుకున్న కథ మాత్రం కాదు. అయితే రషస్ చూశాక మావాడికి తగ్గ కథ అనిపించింది. తెలుగమ్మాయి తాన్వీ ఆకాంక్ష మంచి ఈజ్ ఉన్న నటి. ఇద్దరికీ మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది. నా గత చిత్రాల్లాగే ఇందులోనూ హ్యూమర్‌కు కొదవ ఉండదు. ఈ కథలోనే కామెడీ ఉంది. ఇంటెన్సిటీ ఉన్న ప్రేమకథ ఇది. మళ్లీ ‘నువ్వునాకు నచ్చావ్’ జానర్లో సినిమా చేసిన ఫీల్ కలిగింది.’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు విజయభాస్కర్. ఇంకా చెబుతూ ‘జనరేషన్లు మారినా ప్రేక్షకుల అభిరుచిలో మార్పు రాదనేది నా నమ్మకం. అన్నీ సమపాళ్లలో జోడించి ఎంటర్టైన్ చేయగలిగితే తప్పకుండా ఆడియన్స్ ఆదరిస్తారు. అందరూ కలిసి భోంచేసినట్టు, కలిసి కూర్చొని చూసే సినిమా ఇది. అన్ని తరగతులవారూ ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది.’ అని చెప్పారు విజయభాస్కర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

