నవీన్ నేని, ప్రణీత పట్నాయక్ జంటగా నటిస్తున్న చిత్రం ‘రిచి గాడి పెళ్లి’. కేఎస్ హేమరాజ్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్ను ఇటీవల దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేశారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘పెళ్లికి మానవ సంబంధాలకు ఎలాంటి అనుబంధం వుందో తెలియజెప్పే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ప్రతి పాత్రను ఎంతో వైవిధ్యంగా డిజైన్ చేశాం. తప్పకుండా చిత్రం అందర్ని అలరిస్తుందనే నమ్మకం వుంది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సత్యన్