Mirka Federer : టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ (Roger Federer) మరో ఘనత సాధించాడు. రికార్డు స్థాయిలో 103 ఏటీపీ టైటిళ్లు, 23 గ్రాండ్‌స్లామ్ ట్రోఫీలు గెలుపొందిన ఈ స్విస్ రాకుమారుడు ‘ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు సంపాదించాడు. ఆగస్టు 30, ఆదివారం ఫెదరర్‌కు ఈ గౌరవం దక్కింది. ఈ సందర్భంగా అతడి భార్య మిర్కా ఫెదరర్(Mirka Federer) ప్రసంగం అందరినీ అమితంగా ఆకట్టుకుంది. ‘ఔను.. నేను ఫెదరర్ కంటే పెద్దదాన్ని’ అంటూ మొదలెట్టి.. తమ లవ్ స్టోరీ, వివాహ జీవితం, టెన్నిస్‌లో ఫెదరర్ విజయాలు.. ఇలా ప్రతి అంశాన్నీ క్లుప్తంగా, ఆమె వివరించిన తీరుకు అందరూ మంత్రముగ్దులయ్యారు.
పురుషుల టెన్నిస్‌లో శిఖరం.. టెన్నిస్ ఆడడం ఇంత సులువా అనిపించేలా కోట్లాదిమందికి స్ఫూర్తిగా నిలిచిన రోజర్ ఫెదరర్ పేరు ‘ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్’లో చేరింది. కుటుంబ సభ్యులు, అభిమానుల సమక్షంలో స్విస్ స్టార్ సగర్వంగా ఈ క్లబ్లో చేరాడు. ఈ మహోన్నతమైన రోజున ఫెదరర్ గురించి.. తమ 26 ఏళ్ల అనుబంధం గురించి మిర్కా ఫెదరర్ మాట్లాడిన విషయాలు హైలెట్‌గా నిలిచాయి. కోర్టులో ప్రశాంతంగా ప్రత్యర్థులను ఓడించే ఫెదరర్ జీవితంలోకి తాను
వచ్చిన రోజు నుంచి.. టెన్నిస్ లెజెండ్‌గా అతడు ఎదిగిన తీరును అద్భుతంగా వర్ణించింది మీర.
Roger Federer’s wife, Mirka, fighting back tears while introducing Roger Federer for his induction into the Hall of Fame:
“My husband, my best friend, and now… the newest member of the International Tennis Hall of Fame.”
🥹🥹🥹🥹 pic.twitter.com/n3mhTlgEtg
— The Tennis Letter (@TheTennisLetter) August 30, 2026
‘మా ప్రయాణం 2000 సంవత్సరం సిడ్నీ ఒలింపిక్స్‌తో మొదలైంది. అప్పుడు నాకు 21 ఏళ్లు కాగా.. ఫెదరర్‌కు 18. అవును.. నేను అతడికంటే మూడేళ్లు పెద్దదాన్ని. కానీ, వయసు అనేది అంకె మాత్రమే అని అతడు నన్ను ఒప్పించాడు. ఇప్పటికీ నన్ను అంతే ప్రేమగా చూసుకంటున్నాడు. మా జర్నీ మొదలైనప్పుడు ఫెదరర్ ఒక్క ఏటీపీ టైటిల్ గెలవలే. చెప్పాలంటే.. అతడు అప్పుడు జీరో. ఇప్పుడు చూస్తే.. ఏకంగా 103 టైటిళ్లు సాధించాడు. సిన్సినాటి ఫైనల్లో ఓటమి అనంతరం ఆండీ రాడిక్(అమెరికా) మాట్లాడుతూ.. ‘నేను ఓ మహిళ తీర్చిదిద్దిన వ్యక్తి చేతిలో చిత్తవ్వడాన్ని నమ్మలేకపోతున్నా’ అని అన్నాడు. అతడు చెప్పింది నిజమే. రాడిక్ కామెంట్ తలచుకున్నప్పుడు మాకు నవ్వాగదు.
A moment for Roger & Mirka Federer ♥️ pic.twitter.com/wUlQDk3OPm
— ATP Tour (@atptour) August 29, 2026
ఫెదరర్‌తో ప్రేమలో పడిన రోజుల్లో అతడిలో గమనించిన మొదటి విషయం.. తనకు దగ్గరైన వాళ్లను అతడు ఎంతో ప్రేమిస్తాడు. టెన్నిస్ ఇంత సులభమా అనిపించేలా చేయడం కోసం అతడు ఎంతో శ్రమించేవాడు. నేను అతడి కష్టాన్ని, క్రమశిక్షణను చూశా. అయితే.. నాకు టెన్నిస్ పెద్దగా నచ్చదు. కానీ, ఆ ఆటకు వన్నె తెచ్చిన ఫెదరర్ మాత్రం ఇష్టం. మేము మొదటిసారి కవలలకు జన్మనిస్తున్నామని తెలిసినప్పుడు ఇక ప్రయాణాలు సాధ్యం కాదని భయపడ్డాం.
2000-2026.
L’histoire entre Roger Federer et Mirka a commencé en 2000 après leur rencontre aux Jeux Olympiques. La Suissesse a tenu un rôle immense dans la carrière du Maestro.
Très discrète médiatiquement, elle a donné un discours, hier, pour présenter la légende lors de son… https://t.co/P1tF4aD1KN pic.twitter.com/4x60D95JW1
— Tennis Legend (@TennisLegende) August 30, 2026
టెన్నిస్ మ్యాచ్‌లకు ఇద్దరు పిల్లలతో జర్నీ చేయడం కుదరని, ఇక నేను నీవెంట వచ్చే రోజులు దాదాపు ముగిశాయి అని ఫెదరర్‌తో చెప్పాను. అందుకు అతడు.. అలాగైతే నేను టెన్నిస్ ఆడను అని చెప్పేశాడు. అలాఅనీ అతడేమీ డ్రామా చేయలేదు. పిల్లలు, నాకు అతడు ఎంతో ప్రాధాన్యమిచ్చాడు. ఆట కంటే అతడికి కుటుంబమే ముఖ్యం. అయితే.. ట్విన్స్ పుట్టాక ప్రయాణాలు, టెన్నిస్ మ్యాచ్‌లకు వెళ్లడం అన్నీ జరిగిపోయాయి. రెండోసారి కూడా కవలలే. అప్పటినుంచి టెన్నిస్ టూర్ అనేది మా ఫ్యామిలీకి అలవాటైపోయింది. మా నలుగురు పిల్లలు మైలా, చార్లీనే, లియో, లెన్నిలకు ఫెదరర్ స్విస్ప మ్యాస్ట్రోగా కాదు పపాగానే తెలుసు. అతడు పిల్లలకు కథలు చెప్పి నిద్రపుచ్చుతాడు. వారితో ఆటలు ఆడుతాడు. ఎంత బిజీగా ఉన్నా.. మ్యాచ్‌లో గెలిచినా, ఓడినా సరే పిల్లలతో సమయం కేటాయిస్తాడు. అందుకే ఫెదరర్ మంచి భర్త మాత్రమే కాదు. మంచి కుమారుడు, సోదరుడు, స్నేహితుడు. ఈ ఘనత మా అత్తామామలు రాబర్ట్, లినెట్టెకు చెందుతుంది.
🥹❤️ Emocionantes estas palabras de Mirka sobre Roger.
🗣 “Mucha gente alrededor del mundo conoce a Roger como uno de los mejores tenistas que jamás haya existido. Conocen los títulos, los récords, la elegancia, las rivalidades, las victorias y los momentos que se convirtieron…
— Tiempo De Tenis (@Tiempodetenis1) August 30, 2026
ఎందుకంటే.. వారు అతడిని ఛాంపియన్‌గానే కాదు.. ఉత్తమమైన వ్యక్తిగా పెంచారు. ప్రేమ, దయ.. వంటి గుణాలతో పాటు ప్రతిఒక్కరిని ఒకేలా గౌరవించాలనే విలువలు నేర్పారు. నా భర్త సాధించిన ట్రోఫీలు, రికార్డులు అసాధారణమైనవి. అవన్నీ అతడి కెరీర్లో భాగం. ప్రపంచమంతా తన ఆటను చూస్తున్నప్పుడు అతడు సాధించిన విజయాల కంటే.. ఎవరూ తనను గుర్తించనప్పుడు అతడు గెలిచిన మ్యాచులే నన్ను గర్వపడేలా చేస్తాయి. నీ కెరీర్‌ను చూస్తున్నక్రమంలో నేను ఎన్నో సౌకర్యాలు అనుభవించాను. నీతో జీవితాన్ని పంచుకోవడం అన్నింటికంటే పెద్ద విషయం. నా భర్త, నా బెస్ట్ ఫ్రెండ్.. ఇప్పుడు ‘ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్’లో కొత్త సభ్యుడు’ అని మిర్కా తన సుదీర్ఘ ప్రసంగాన్ని ముగించడమే ఆలస్యం..ఆహుతులు కరతాళధ్వనులతో ఫెదరర్‌కు స్వాగతం పలికారు. మిర్క మాట్లాడుతున్నంత సేపు భావోద్వేగానికి లోనై టెన్నిస్ లెజెండ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన సొగసైన టెన్నిస్‌పై చెరగని ముద్ర వేసిన ఫెదరర్.. 2022 సెప్టెంబర్‌లో, 41 ఏళ్ల వయసులో వీడ్కోలు పలికాడు.