భాగ్యనగరంలో బాలకృష్ణ హంగామా
ఓ వైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు, ఇంకోవైపు కేన్సర్ హాస్పిటల్.. క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు బాలకృష్ణ. మూడు బాధ్యతల్నీ సమర్థవంతంగా నెరవేరుస్తున్నారనడానికి ఆయా రంగాల్లో ఆయన విజయాలే నిదర్శనం. ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది.
ఓ వైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు, ఇంకోవైపు కేన్సర్ హాస్పిటల్.. క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు బాలకృష్ణ. మూడు బాధ్యతల్నీ సమర్థవంతంగా నెరవేరుస్తున్నారనడానికి ఆయా రంగాల్లో ఆయన విజయాలే నిదర్శనం. ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. వచ్చే నెల నుంచి బాలకృష్ణ తన నియోజకవర్గం హిందూపురంలో బిజీబిజీ. అందుకే.. బాబీ దర్శకత్వంలో చేస్తున్న ‘ఎన్బీకే 109’ షూటింగ్‌ను చకచకా పూర్తిచేసేపనిలో ఉన్నారు బాలయ్య.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 30శాతం పూర్తిచేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన భారీ సెట్లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. బాలయ్యపై కీలక సన్నివేశాలతోపాటు ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్‌ని కూడా ఈ సెట్లోనే తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కె.ఎస్.రవీంద్ర(బాబీ).
వచ్చే నెల నుంచి బాలకృష్ణ అందుబాటులో ఉండరు గనుక, ఆ నెలలో ఆయన లేని సన్నివేశాలు చిత్రీకరిస్తారని సమాచారం. దానికోసం మరో షెడ్యూల్ కూడా ప్లాన్ చేశారు బాబీ. ఎట్టిపరిస్థితుల్లో రానున్న దసరాకి ఈ సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలో నటించనున్న ఈ చిత్రంలో బాబీడియోల్ విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. త్రిష, మీనాక్షి చౌదరి, శద్ధాశ్రీనాథ్ కథానాయికలుగా నటిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఊర్వశీ రౌతాలా కూడా ఇందులో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నట్టు తెలిసింది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

