తమిళ అగ్ర కథానాయకుడు విజయ్‌తో ‘తేరి’‘మెర్సల్’‘బిగిల్’ వంటి కమర్షియల్ సినిమాల్ని తెరకెక్కించి మంచి విజయాల్ని అందుకున్నారు యువ దర్శకుడు అట్లీ. ప్రస్తుతం ఆయన బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్‌తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి ‘జవాన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
ఈ మేరకు శుక్రవారం ఓ ప్రత్యేక వీడియోను పంచుకోవడంతో పాటు టైటిల్ టీజర్‌ను విడుదల చేశారు. పాన్ ఇండియా స్థాయిలో వచ్చే ఏడాది జూన్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో షారుఖ్‌ఖాన్ ద్విపాత్రాభినయంలో కనిపిస్తారని, వాణిజ్య పంథా కలబోసిన దేశభక్తి ప్రధాన చిత్రమిదని చెబుతున్నారు. ఈ చిత్రాన్ని షారుఖ్‌ఖాన్ సతీమణి గౌరీఖాన్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షారుఖ్‌ఖాన్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ‘పఠాన్’ చిత్రంలో నటిస్తున్నారు. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో ‘డంకీ’ పేరుతో ఓ సినిమా చేయబోతున్నారు.