Nithiin | నితిన్ ఫంక్షన్‌కు రాలేదని.. భావోద్వేగానికి లోనైన అమ్మరాజశేఖర్
Amma Rajasekhar Fires On Nithiin | ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించి దర్శకుడిగా ‘రణం’, ‘ఖతర్నాక్’, ‘టక్కరి’ వంటి సినిమాలను తెరకెక్కించాడు. తెలుగు బిగ్‌బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్‌గా వచ్చి బుల్లితెర ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం ఈయన నటించి దర్శకత్వం వహించిన చిత్రం ‘Hi-Five’. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. కాగా ఈ వేడుకలో హీరో నితిన్‌పై అమ్మ రాజశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నితిన్ ప్రవర్తన తనను ఎంతగానో భాదపెట్టిందని భావోద్వేగానికి లోనైయ్యాడు.
అమ్మ రాజశేఖర్ అంతలా భావోద్వేగం అవడానికి కారణం ఏంటంటే.. హై ఫైవ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నితిన్‌ను గెస్ట్‌గా పిలిచాడట. తను కూడా వస్తానని చెప్పాడట. అయితే నితిన్ తన వ్యక్తిగత కారణాలతో ఈ వేడుకకు రాలేదు. దాంతో అసహనానికి గురైన అమ్మ రాజశేఖర్ నితిన్‌పై తీవ్రంగా మండిపడ్డాడు. పది రోజుల ముందే నితిన్‌ను ఈ వేడుకకు ఆహ్వానించానని, నితిన్ కోసం ప్రత్యేకంగా ఏవీ కూడా క్రియేట్ చేయించా అని చెప్పాడు. నితిన్‌కు అస్సలు డ్యాన్స్ రాదని, తనకు డ్యాన్స్ నేర్పించి ఓ గుర్తింపు వచ్చేలా చేసిన గురువులాంటి నాపై గౌరవంతో వస్తారని భావించా. కానీ, ఆయన ఇంట్లో ఉండి కూడా ఇక్కడికి రాలేదు. ఫోన్ చేస్తే జ్వరమని చెప్పాడు. దానికి నేను వీడియో బైట్ అయినా పంపమని కోరాను. అదీ ఇవ్వలేదు. అంటూ భావోద్వేగానికి లోనైయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో వైరల్ అవుతుంది. గతంలో వీరి కాంబోలో ‘టక్కరి’ అనే సినిమా తెరకెక్కింది. సదా హీరోయిన్గా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్‌గా మిగిలింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

