వైవిధ్యమైన కథాంశాలను ఎన్నుకోవడంలో సిద్ధహస్తుడు నందమూరి కల్యాణ్‌రామ్. ఓ వైపు నటుడిగా ఎదుగుతూ, మరోవైపు ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై అభిరుచిగల చిత్రాలను నిర్మిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు కల్యాణ్‌రామ్. ప్రస్తుతం ఆయన ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. విజయశాంతి కీలకపాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు ‘మెరుపు’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఇదిలావుంటే.. త్వరలో తన సొంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్పతాకంపై ‘కుమారి 21ఎఫ్’ ఫేం సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని కల్యాణ్‌రామ్ నిర్మించనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇందులో ఆయనే హీరోగా కూడా నటిస్తారని తెలుస్తున్నది. ప్రస్తుతం సూర్యప్రతాప్ ఓటీటీ కోసం ఓ వెబ్ సిరీస్ చేసే పనిలో ఉన్నారు. ఆ తర్వాత కల్యాణ్‌రామ్ సినిమా చేస్తారని టాక్. ఈ సినిమా కథ, స్క్రీన్‌ప్లే, మాటలు కూడా సూర్య ప్రతాపే అందిస్తారట. ఎన్టీఆర్ ‘దేవర’ నిర్మాతల్లో కల్యాణ్‌రామ్ కూడా ఒకరిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.