NBK 107 | ‘అఖండ’ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు నందమూరి బాలకృష్ణ. అదే జోష్‌తో తన తదుపరి సినిమా షూటింగ్‌ను వేగంగా పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ‘క్రాక్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత గోపిచంద్ మలినేని, బాలకృష్ణతో సినిమా చేయనుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన బాలయ్య ఫస్ట్‌లుక్ పోస్టర్ అంచనాలను రెట్టింపు చేసింది. కాగా ఈ చిత్రం నుంచి తరచూ ఒక అప్డేట్ బయటకు వస్తూనే ఉంది. ఈ క్రమంలో మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
బాలయ్య సినిమాలలో డైలాగ్సే కాదు డాన్సులు కూడా ఇరగదీస్తుంటాడు. ఈ క్రమంలోనే బాలయ్య 107వ చిత్రంలో కూడా ఒక మాస్ ఐటెం సాంగ్ ఉండనుందట. ఇందులో బాలయ్య వేసే స్టెప్పులు అభిమానులకు పూనకాలు తెప్పిస్తాయట. అయితే ఈ ఐటెం సాంగ్‌లో బాలయ్యకు జోడీగా ‘ఖిలాడీ’ బ్యూటీ డింపుల్ హయతి స్టెప్పులేయనుందని సమాచారం. ఇప్పటికే ఈ పాటకు సంబంధించిన ట్యూన్‌ను థమన్ సిద్ధం చేశాడని టాక్. శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ హనీరోజ్ సెకండ్ హీరోయిన్గా నటించనుందట. ఈ చిత్రానికి ‘అన్నగారు’ అనే టైటిల్‌ను పరిశీలనలో ఉంచినట్లు సమాచారం. మైత్రీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కన్నడ యాక్టర్ దునియా విజయ్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు.