TNR చిరంజీవి సినిమాకు పని చేశాడని తెలుసా..?
TNR చిరంజీవి సినిమాకు పని చేశాడని తెలుసా | ప్రముఖ జర్నలిస్ట్, యూట్యూబ్ యాంకర్, నటుడు తుమ్మల నరసింహా రెడ్డి మరణం అతడి సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ప్రముఖ జర్నలిస్ట్, యూట్యూబ్ యాంకర్, నటుడు తుమ్మల నరసింహా రెడ్డి మరణం అతడి సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. సరిగ్గా వారం రోజుల కింద అందరికీ కరోనా జాగ్రత్తలు చెప్పిన ఈయనను అదే మహమ్మారి కబలిస్తుందని ఎవరూ ఊహించలేదు. కేవలం 46 ఏళ్ల వయసులో ఆయన కరోనా కాటుకు బలైపోయాడు. ఇప్పటికే యూ ట్యూబ్ లో తన ఇంటర్వ్యూలతో చరిత్ర సృష్టించిన టిఎన్ఆర్.. నటుడిగానూ ఇప్పుడిప్పుడే తనదైన గుర్తింపు సంపాదించుకున్నాడు. దాదాపు 40 సినిమాలకు పైగా నటించాడు ఈయన. 20 సినిమాలు ఈయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.
ఈ మధ్య రెగ్యులర్ గా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. బయట కరోనా సెకండ్ వేవ్ వున్నా కూడా 10 రోజుల కిందటి వరకు కూడా షూటింగ్ చేశాడు టిఎన్ఆర్. ఉన్నట్టుండి అనారోగ్యం పాలు కావడం.. రెండు మూడు రోజుల్లో పరిస్థితి విషమించి ఈయన కన్నుమూయడం అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. టిఎన్ఆర్ మరణవార్త తెలిసి సినీ రాజకీయ ప్రముఖులు కూడా సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈయన ఇండస్ట్రీకి దర్శకుడు కావాలని వచ్చాడు.
ఈ క్రమంలోనే సీనియర్ రచయిత నటుడు ఎల్.బి.శ్రీరామ్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేశాడు. కొన్ని సినిమాలకు స్క్రిప్టులో సహకారం అందించాడు. అప్పట్లో చిరంజీవి హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా హిట్లర్ స్క్రిప్ట్ లోనూ టిఎన్ఆర్ రచనా సహకారం అందించినట్లు తెలుస్తోంది.
ఆ తర్వాత కూడా ఎల్బీ శ్రీరామ్ కథ మాటలు రాసిన సినిమాలకు ఈయన సహకారం ఉంది. అక్కడి నుంచి న్యూస్ చానల్స్ లో ప్రస్థానం మొదలుపెట్టి యూ ట్యూబ్ లో యాంకర్ గా స్టార్ స్టేటస్ అందుకున్నాడు టిఎన్ఆర్. ఇప్పుడిప్పుడే కెరీర్లో అంచలంచలుగా ఎదుగుతున్న సమయంలో అనూహ్య రీతిలో ఆయన హఠాన్మరణం తెలుగు ఇండస్ట్రీకి కూడా తీరని లోటుగా మిగిలిపోయింది. ఎప్పటికైనా ఒక సినిమా దర్శకత్వం వహించాలని కలలు కంటున్న తుమ్మల నరసింహారెడ్డిని కరోనా నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్లిపోయింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

