Abhishek Bachchan – Nimrat Kaur | బాలీవుడ్ స్టార్ కపుల్స్ ఐశ్వర్య రాయ్ – అభిషేక్ బచ్చన్లు విడిపోతున్నారంటూ గత కొన్ని రోజులుగా బాలీవుడ్ మీడియా కోడై కూస్తున్న విషయం తెలిసిందే. ధాయ్ అక్షర ప్రేమ్ కే (Dhai Akshar Prem Ke) సినిమా టైంలో ప్రేమలో పడిన ఈ జంట దాదాపు ఏడేళ్లు డేటింగ్లో ఉండి 2007లో పెళ్లి చేసుకున్నారు. అయితే 17 ఏండ్లు కలిసి ఉన్న ఈ జంట విడిపోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్ నిమ్రత్ కౌర్‌తో ప్రేమలో పడిన అభిషేక్ బచ్చన్ గత కొన్ని రోజులుగా ఐశ్వర్యను దూరం పెడుతున్నట్లు తెలుస్తుంది. ఐశ్వర్యకు విడాకులు ఇచ్చి నిమ్రత్‌ను పెళ్లి చేసుకోనే ఆలోచనలో బిగ్ బీ తనయుడు ఉన్నట్లు సమాచారం.
అభిషేక్ నటించిన ఇటీవల నటించిన చిత్రం దస్వి(Dasvi). ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది నిమ్రత్ కౌర్(Nimrat Kaur). అయితే ఈ సినిమా టైం నుంచే వీరిద్దరు కలిసి తిరుగుతున్నట్లు తెలుస్తుంది. నిమ్రత్ కౌర్ కూడా 42 ఏండ్లు వచ్చిన సింగిల్‌గా ఉండడంతో ఆ బ్యూటీపై మోజుపడి తన భార్య ఐశ్వర్యరాయ్ కి విడాకులు ఇవ్వబోతున్నట్లు రూమార్స్ వస్తున్నాయి. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు. కానీ, ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది.
మరోవైపు ఇటీవల అనంత అంబానీ-రాధిక మర్చంట్ పెళ్లి సమయంలో కూడా అభిషేక్ బచ్చన్ – ఐశ్వర్యరాయ్ విడాకుల ప్రస్తావన తెర మీదకు వచ్చింది. ఐశ్వర్య తన కూతురు ఆద్యతో కలిసి హాజరవ్వగా.. అభిషేక్ బచ్చన్ మాత్రం తన తల్లిదండ్రులతో కలిసి హాజరయ్యారు. పైగా ఈ వేడుకల్లో హీరో అమితాబచ్చన్ మాజీ ప్రేయసి రేఖతో ఐశ్యర్య చనువుగా వ్యవహరించిందంట. ఈ విషయం బచ్చన్ కుటుంబ సభ్యులకు నచ్చలేదని వార్తలు వినిపిస్తాయి.