‘Dhee’ Show Choreographer Abhi Arrested | ఢీ షో డాన్సర్ ప్రేమ పేరుతో తనను మోసం చేశాడంటూ సెల్ఫీ వీడియో తీసుకుని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం జిల్లా రూరల్ మండలంలోని పొన్నెకల్లు గ్రామంలో చోటుచేసుకుంది. చనిపోయిన యువతి పేరు కావ్య కళ్యాణి (24) కాగా.. ఈ వీడియోలో యువతి చెప్పిన ప్రకారం..
ప్రముఖ టీవీ డాన్స్ రియాలిటీ షో ఢీ(Dhee Show) లో డ్యాన్సర్‌గా పాల్గోంది కళ్యాణి. ఇక్కడే తనకు అభి అనే వ్యక్తి పరిచయం అయినట్లు తెలిపింది. వీరిద్దరి పరిచయం ప్రేమగా మారాగా అనంతరం ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. దాదాపు 5 సంవత్సరాలుగా కలిసి ఉన్న అనంతరం ఇప్పుడు నన్ను వద్దని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు. ఈ మోసాన్ని తట్టుకోలేక నేను ఆత్మహత్యకు పాల్పడుతున్నాను అంటూ సెల్ఫీ వీడియో తీసి ఫ్యాన్‌కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కావ్య సెల్ఫీ వీడియోను ఆధారంగా తీసుకుని, అభిని విచారిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఢీ షో డాన్సర్ నన్ను మోసం చేశాడంటూ.. సెల్ఫీ వీడియో తీసుకుని యువతి ఆత్మహత్య
ఖమ్మం రూరల్ పొన్నెకల్లులో ఘటన
నా చావుకు కారణం ఢీ షో డాన్సర్ అభి అని కావ్య కళ్యాణి ఆరోపణ
తనని పెళ్ళి చేసుకుని కాపురం ఉంటూ.. ఇప్పుడు మరొకరిని పెళ్ళి చేసుకుంటున్నట్లు తెలుసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ కావ్య… pic.twitter.com/EHBZLr4pS3
— Telugu Scribe (@TeluguScribe) March 1, 2025