ధనుష్ బిజీ బిజీ..
సాధారణంగా మలయాళం హీరోలు ఎక్కువ సినిమాల్లో నటిస్తుంటారు. తెలుగు, తమిళ, కన్నడ కథానాయకులు మాత్రం ఏడాదికి రెండు సినిమాలు చేయడం గొప్ప. కానీ వారిలో ధనుష్‌ని మాత్రం మినహాయించాలి. ఏడాదికి మూడ్నాలుగు సినిమాలు చేస్తూ జయాపజయాల గురించి ఆలోచించకుండా కెరీర్ సాగిస్తుంటాడు ధనుష్. తన వల్ల ఎక్కువమందికి పని దొరకడం ఆనందమేకదా.. అంటూ చాలా సందర్భాల్లో చెప్పాడు కూడా.

ప్రస్తుతం ఆయన తన 50వ చిత్రంలో నటిస్తున్నారు. దానికి దర్శకుడు కూడా ధనుషే కావడం విశేషం. ఇదిలావుంటే ఇటీవల సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్ ఓ ఇంటర్వ్యూలో ధనుష్ డైరెక్షన్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ‘ప్రస్తుతం నేను ధనుష్ హీరోగా నటిస్తున్న ‘కెప్టెన్ మిల్లర్’ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాను. ఇది ధనుష్ 49వ సినిమా. ఈ సినిమా తర్వాత ఆయన దర్శకత్వంలోనే ‘డి50’ మూవీ రానుంది.
ఆ సినిమా తర్వాత మళ్లీ ధనుష్ మరో సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. అయితే.. ఇందులో విశేషం ఏంటంటే.. హీరో ఆయన కాదు. మరో స్టార్ హీరో అందులో హీరోగా నటించనున్నారు. ధనుష్ ఓ ప్రత్యేక పాత్ర పోషించనున్నాడు. ఆ సినిమాకు సంగీత దర్శకత్వం నేనే చేస్తున్నా. ఊహలకు అందని కథ, కథనాలతో ఆ సినిమా ఉంటుంది’ అంటూ చెప్పారు జీవి ప్రకాశ్‌కుమార్. నటుడిగా, గాయకుడిగా, నిర్మాతగా అందరి మన్ననలందుకున్న ధనుష్.. దర్శకుడిగా కూడా సత్తా చాటనుండటం నిజంగా అభినందించదగ్గ విషయం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!